రొటీన్ సినిమాలతోనే హిట్లు కొట్టడం త్రినాథరావు నక్కిన స్టైల్. పాత కథల్ని కొత్త మూసలో పోసి, బాగానే హిట్టు కొడుతాడని `సినిమా చూపిస్త మావ` - `నేను లోకల్` సినిమాలు చెప్పాయి. ఆ రెండు సినిమాలు ఊహాతీతంగా విజయాలు అందుకోవడంపై క్రిటిక్స్ పెదవి విరిచేసినా.. మరోసారి అలాంటి మ్యాజిక్ చేసి సత్తా చాటుతాడేమో! అన్న సందేహాల్ని కలిగిస్తోంది ఈ ట్రైలర్. రామ్ - అనుపమ పరమేశ్వరన్ జంటగా త్రినాథరావు నక్కిన తెరకెక్కిస్తున్న `హలో గురూ ప్రేమకోసమే` ట్రైలర్ చూడగానే కలిగిన ఫీలింగ్ ఇది.
నేల విడిచి సాము చేయకుండా.. జనాలకు బాగా తెలిసిన కంటెంట్ తోనే మెప్పిస్తే ఎలా ఉంటుంది? ఈ ఫార్ములాని మాత్రం త్రినాథరావు వదిలిపెట్టడం లేదు. బాగానే ఉందికానీ... మరీ పాత సినిమాల్నే చూపిస్తే ఎలా? అన్న ఆవేదనను అర్థం చేసుకుని ఈ సినిమాలో త్రినాథరావు ఇంకేదైనా చేసాడేమో చూడాలి. ``ఇంత పొద్దున్నే సుద్దుగాడు ఎక్కడికెళ్లాడే!`` అంటూ పోసాని అనేస్తే.. వాడినెవడినో కొట్టడానికి పొద్దున్నే లేచెల్లాడు! అంటూ సితార చెప్పే ఆ డైలాగ్ కాస్త పాత మూస వాసనలా అనిపించినా.. ఆ తర్వాత రామ్‌లోని ఎనర్జీ - విజువల్ గ్లింప్స్ ట్రైలర్ లో ఆకట్టుకుంది.
స్కూల్ అయినా - కాలేజ్ అయినా ఆఫీస్ అయినా జాయిన్ అయిన ఫస్ట్ డే ఎవరైనా చేసేదేంటి? అమ్మాయిల్లో అబ్బాయిలు - అబ్బాయిల్లో అమ్మాయిలు ఎవరు బావున్నారో ఏరుకోవడం.. అంటూ లెంగ్తీగా డైలాగ్ చెప్పినా రామ్ ఏజ్ కి - ఎనర్జీకి సూటయ్యిందనిపిస్తుంది. రామ్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టే కథని ఎంచుకోవడం త్రినాథరావుకు ప్లస్. కాలేజ్ బోయ్ గా స్మార్ట్ గా కనిపిస్తున్నాడు. ఇక అనుపమ పరమేశ్వరన్ ఎప్పటిలానే తనదైన సాంప్రదాయక లుక్ - అందచందాలతో కట్టిపడేసింది. క్యూట్ గా కనిపిస్తూనే కుర్రకారు గుండెల్ని చిదిమేసింది. ``గుర్తుంచుకోవాలి గుర్తుంచుకోవాలి అనుకునే చదువును మర్చిపోతాం.. కానీ మర్చిపోవాలి మర్చిపోవాలి అనుకునే అమ్మాయిని మాత్రం .. దీనమ్మా! చచ్చేదాకా మర్చిపోలేం..`` అంటూ ఎమోషన్ తో రగిలిపోయే ప్రేమికుడిలా రామ్ ఎక్స్ ప్రెషన్ బావుంది. వీటన్నిటినీ మించి మావయ్య ప్రకాష్ రాజ్ తో రామ్ కమ్యూనికేషన్ ఇంట్రెస్టింగ్. ఒక ఫ్రెండులాంటి పాత్రలో విలక్షణ నటుడు మైమరిపిస్తున్నాడు. అలాంటి ఒక మావయ్య నాక్కూడా కావాలి! అనిపించేంత బావుంది ఆ ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ. అమాయక మావయ్యలా ప్రకాష్ రాజ్ నటన ఆకట్టుకుంది. అక్టోబర్ 18న దసరా కానుకగా `హలో గురూ ప్రేమకోసమే` రిలీజ్ కి వస్తోంది. దసరాకి లవ్ లో పడతారు! అనేస్తున్నారు కాబట్టి వేచి చూడాలి. రామ్ కి - త్రినాథరావుకి - నిర్మాత దిల్ రాజుకి ఈ సినిమా హిట్టెక్కడం ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి అందరిలో ఒకటే క్యూరియాసిటీ.
Full View