గౌతమీ పుత్ర శాతకర్ణి.. బాలయ్య వందో సినిమా ఇది ఇప్పటికే ఫిక్స్ అయిపోయింది. తల్లికి అమిత ప్రాధాన్యం ఇచ్చే వంశం కావడంతోనే.. అప్పటికి శాతవాహన రాజులకు అమ్మపేరుతో లింక్ అయ్యేలా పేర్లు ఉండేవి. అలాగే ఈ శాతకర్ణి అమ్మ పేరు గౌతమి. బాలయ్య వందో సినిమాలో ఈ పాత్రకు అమితమైన ప్రాధాన్యం ఉంటుంది.
అందుకే ఈ రోల్ కోసం పలువురిని సంప్రదించిన తర్వాత.. చివరకు బాలీవుడ్ సీనియర్ నటి హేమమాలినికే ఫిక్స్ అయ్యారు. ఈమెకు ఇది టాలీవుడ్ లో మూడో సినిమా. ఆమె కెరీర్ తొలి నాళ్లలోనే 1965లో పాండవ వనవాసం చిత్రంలో ఓ డ్యాన్సర్ గా నటించింది హేమమాలిని. ఆ తర్వాత 1971లో శ్రీ కృష్ణ విజయంలోనూ రంభగా కనిపించి అలరించింది.
ఇప్పుడు చారిత్రక చిత్రంగా తెరకెక్కుతున్న గౌతమీపుత్ర శాతకర్ణిలో హేమమాలిని కీలక పాత్ర పోషిస్తున్న విషయాన్ని బాలయ్య కన్ఫాం చేసేశారు. నటిగా ఎన్నో మైలురాళ్లు అందుకున్న హేమమాలిని.. ఈ పాత్రపై ఎంతో ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి 45 ఏళ్ల తర్వాత మళ్లీ హేమమాలినిని తెలుగు తెరపై చూసే అవకాశం టాలీవుడ్ ప్రేక్షకులకు దక్కనుంది.