వరుస ఓటిటి రిలీజులతో డైలామాలో పడిన హీరో..!

Update: 2021-06-05 02:30 GMT
బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం వరుస రిలీజ్ లతో దూసుకుపోతున్నాడు హీరో అర్జున్ కపూర్. ఇప్పటికే లాక్ డౌన్ కాలంలో రెండు సినిమాలు డిజిటల్ రిలీజ్ చేసాడు. ఇప్పుడు ఇదే వరుసలో తాను నటించిన మరో సినిమా రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తుంది. ఇటీవలే అర్జున్ నటించిన 'సర్దార్ కా గ్రాండ్సన్' అనే సినిమా నెట్ ఫ్లిక్స్ వేదికగా డిజిటల్ రిలీజ్ అయింది. అలాగే 'సందీప్ ఔర్ పింకీ ఫెరార్' మూవీ కూడా ఓటిటి రిలీజ్ అయిపోయింది. ప్రస్తుతం మరో సినిమా కూడా ఓటిటి రిలీజ్ అనేసరికి హీరోను 'ఓటిటి హీరో' అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అర్జున్ కపూర్ కెరీర్ ప్రారంభంలో మంచి హిట్ సినిమాలు చేసాడు.

కానీ కొన్నేళ్లుగా కెరీర్ లో మూవీస్ సెలక్షన్ పూర్తిగా మారిపోయింది. మరి ఏ విధంగా కథలు ఎంపిక చేసుకుంటున్నాడో తెలియదు కానీ వరుసగా తన క్రేజ్ పోగొట్టుకుంటున్నాడు. కెరీర్ ప్రారంభంలో వరుస హిట్స్ పడేసరికి బాలీవుడ్ కి మరో హీరో వచ్చేసాడని అంతా అనుకున్నారు. కానీ ఓవైపు ప్రొఫెషనల్ గా మరోవైపు పర్సనల్ లైఫ్ ద్వారా పూర్తిగా ప్లాప్స్ ఎదుర్కొంటున్నాడు. నిజానికి అర్జున్ ఫెయిల్యూర్స్ వెనుక పర్సనల్ లైఫ్ చాలా ఎఫెక్ట్ చూపుతుందని టాక్ నడుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం అర్జున్ తనకంటే వయసులో ఓల్డ్ అయినటువంటి ఓ స్టార్ సెలబ్రిటీతో రిలేషన్ లో ఉన్నాడు.

అందుకే కెరీర్ పై పూర్తిగా ఫోకస్ పెట్టట్లేడేమో అని టాక్.  అయితే ఈ మధ్యకాలంలో అర్జున్ వరుసగా ప్లాప్స్ మాత్రమే ఖాతాలో వేసుకున్నాడు. అర్జున్ ప్రెసెంట్ గ్రాఫ్ చూసి బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఇతని సినిమాలు కొనేందుకు ముందుకు రావడం లేదని ఇండస్ట్రీలో పలు కథనాలు వైరల్ అవుతున్నాయి. ఆ కారణంగానే సినిమాలను థియేట్రికల్ రిలీజ్ కోసం హోల్డ్ చేయకుండా సందీప్ ఔర్ పింకీ ఫెరార్ - సర్దార్ కా గ్రాండ్సన్ సినిమాలను నిర్మాతలు ఓటిటిలో రిలీజ్ చేసేసారు. ఇప్పుడు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ 'భూత్ పోలీస్' కూడా జులై లో ఓటిటి రిలీజ్ కాబోతుందని తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో ఏ హీరో నుండి కూడా వరుసగా మూడు ఓటిటి రిలీజులు కాలేదు. మరి ఇలాగే అర్జున్ సినిమాలు ఓటిటి బాటపడితే ఖచ్చితంగా అతని థియేట్రికల్ బిజినెస్ పై ప్రభావం పడుతుందని అర్ధమవుతుంది. చూడాలి మరి ఇకపై కేర్ తీసుకుంటాడేమో. ప్రస్తుతం అర్జున్ ఏక్ విలన్ రిటర్న్స్ అనే సినిమాలో నటిస్తున్నాడు.
Tags:    

Similar News