మరోసారి రియల్‌ హీరో అనిపించుకున్న మనోజ్‌

Update: 2019-03-19 09:04 GMT
మంచు మోహన్‌ బాబు నట వారసుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మంచు మనోజ్‌ ఆన్‌ స్క్రీన్‌ హీరోగా ఎక్కువ సక్సెస్‌ కాలేక పోయినా కూడా రియల్‌ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎక్కడ ఏ విపత్తు వచ్చినా కూడా వెంటనే స్పందించే వ్యక్తి మంచు మనోజ్‌ అనే పేరు పొందాడు. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్‌ ఇచ్చి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న మంచు మనోజ్‌ రాజకీయాలపై కూడా ఆసక్తి చూపుతున్నాడనే విషయం తెల్సిందే. ప్రస్తుతానికి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ ప్రజా సేవ, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్న మంచు మనోజ్‌ తాజాగా మరో మంచి పని చేసి వావ్‌ అనిపించుకున్నాడు.

నేడు తన తండ్రి మోహన్‌ బాబు 69వ పుట్టిన రోజు సందర్బంగా మంచి నిర్ణయం తీసుకున్నాడు. మనోజ్‌ తండ్రి పుట్టి రోజు సందర్బంగా సిరిసిల్లకు చెందిన అశ్వితను దత్తత తీసుకున్నాడు. ఆ విషయాన్ని స్వయంగా ట్విట్టర్‌ ద్వారా వెళ్లడించాడు. తనకు ప్రాణానికి ప్రాణం అయిన తండ్రి పుట్టిన రోజు సందర్బంగా ఏదైనా మంచి చేయాలని అనిపించింది. అందుకే అశ్వితను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. అశ్వితకు మంచి ప్రతిభ ఉంది, ఆమె ఐఏఎస్‌ కావాలని కోరుకుంటుంది. తన చదువు బాధ్యతను పూర్తిగా నేనే చూసుకుంటాను. తమ తిరుపతి స్కూల్‌ లో జాయిన్‌ చేయడంతో పాటు, ఆ తర్వాత విద్యాబ్యాసంకు కూడా తానే ఆర్థిక సాయం చేస్తానంటూ మనోజ్‌ ప్రకటించాడు. మనోజ్‌ తీసుకున్న నిర్ణయంపై నెటిజన్స్‌ ప్రశంసలు కురిపిస్తూ, రియల్‌ హీరో అంటూ అభినందిస్తున్నారు.

ఇక మనోజ్‌ సినిమాల విషయానికి వస్తే సంవత్సర కాలంగా మనోజ్‌ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. త్వరలోనే ఒక మంచి ప్రాజెక్ట్‌ తో మీ ముందుకు వస్తాను అంటూ ఆమద్య ప్రకటించాడు. ప్రస్తుతానికి అయితే మనోజ్‌ ఏ ప్రాజెక్ట్‌ ను చేయడం లేదు. త్వరలోనే ప్రారంభించి ఈ ఏడాది చివరి వరకు తీసుకు వస్తాడేమో చూడాలి.
Tags:    

Similar News