బాలీవుడ్ క్లాసిక్ ని టచ్ చేస్తే మంటే... బిగ్‌బి అమితాబ్ నటించిన షోలేని ఆర్జీవీ ఆగ్ పేరుతో రీమేక్ చేశాడు. అది అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆర్జీవీకి అన్నిచోట్ల నుంచి చీవాట్లొచ్చాయి. ఆ తర్వాత మరో క్లాసిక్ హిట్ జంజీర్ ని మెగాస్టార్ తనయుడు చరణ్ రీమేక్ చేసి అదే తీరుగా చీవాట్లు తినాల్సొచ్చింది. ఈ రెండు సందర్భాల్లో రెండు సినిమాలు అట్టర్‌ఫ్లాప్‌లు. క్లాసిక్స్ ని చెడగొట్టారంటూ సినీప్రియులంతా దారుణంగా తిట్టారు.
అందుకే బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన క్లాసిక్స్ ని తిరిగి రీమేక్ చేయాలంటే ఆచి తూచి అడుగులేస్తున్నారంతా. అయితే కండల హీరో సల్మాన్ ఖాన్ తెలిసీ తప్పు చేశాడు. ఓ కొత్త జంటను తెరకి పరిచయం చేస్తూ .. అలనాటి మేటి క్లాసిక్ హీరోని రీమేక్ చేశాడు. ఇటీవలే రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాల్చీ తన్నింది. దీంతో ఇప్పుడు సల్మాన్ పై తీవ్ర విమర్శలొస్తున్నాయి. సినిమా సెలబ్రిటీలంతా ఫోన్ లు చేసి మరీ తిడుతున్నారు. క్లాసిక్ ని చెడగొట్టావే అంటూ చీవాట్లు వేస్తున్నారు. ఈ సినిమాలో సల్లూ భాయ్ స్నేహితుడు ఆదిత్య పాంచోళీ తనయుడు సూరజ్ పాంచో ళీ హీరోగా నటించాడు. ఇదే చిత్రంతో స్టార్ హీరో సునీల్ శెట్టి తనయురాలు ఆథియా శెట్టి నాయికగా పరిచయమైంది.
రెఫ్యూజీతో ఎంట్రీ ఇచ్చి అభిషేక్ బచ్చన్ ఎలాంటి చీవాట్లు తిన్నాడో ఇప్పుడు యువహీరో సూరజ్ పాంచోళీ అలాగే తిట్లు తింటున్నాడు. ఈ డ్యామేజ్ నుంచి బైటపడాలంటే సదరు యంగ్ హీరో చాలా ట్యాలెంటు చూపించాల్సి ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్ ఉన్నంత మాత్రాన ఇక్కడ ఆట ఆడేస్తానంటే కష్టం. మునుముందు సీరియస్ గా తనని తాను మెరుగులు దిద్దుకుని సిసలైన హీరో అనిపించుకోవాల్సిందే.