తమిళ హీరో ప్రశాంత్ గుర్తున్నాడుగా. అదేనండి... జీన్స్ చిత్రంలో ఐశ్వర్య రాయ్ తో ప్రేమాయణం ఒలకబోసి ప్రేక్షకుల ఆదరణను చూరగొన్నాడే... అతడే ప్రశాంత్. సినిమాల్లో బుద్దిమంతుడిగానే కనిపించిన ప్రశాంత్... నిజ జీవితంలోనూ అమాయకుడేనట. తన మంచితనంతోనే అవతలి వ్యక్తి పూర్వాపరాలతో ఏమాత్రం సంబంధం లేకుండా... తాను పెళ్లి చేసుకునే యువతికి సంబంధించి పేరాల మేర ఆరాలు తీయకుండానే 2005లో పెళ్లి పీటలెక్కేసిన ప్రశాంత్... ఆ తర్వాత తన భార్యామణి గృహలక్ష్మి అసలు రూపం తెలుసుకుని షాక్ తిన్నాడు.
తనతో పెళ్లికి ముందే గృహలక్ష్మికి మరో వ్యక్తితో పెళ్లి అయ్యిందని, తనతో పెళ్లి అయినా గృహలక్ష్మి తన మాజీ భర్తతో ఇంకా వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని తెలుసుకుని కోర్టుకెక్కి మరీ చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నాడు. కోర్టు కూడా ప్రశాంత్ చెప్పిన కారణాలు విని... అతడి కోరిక మేరకే విడాకులు మంజూరు చేసింది. అయితే ఆ తర్వాతే... గృహలక్ష్మి తన అసలు రూపం బయటపెట్టుకుంది. ప్రశాంత్ లాంటి అమాయకుడిని వదులుకునేందుకు ఇష్టపడక... కోర్టుకెక్కి అయినా అతడితో కలిసి ఉండాలని భావించింది.
ఈ క్రమంలో వారిద్దరి మధ్య కోర్టులో జరిగిన వాదోపవాదాల్లో ప్రశాంతే గెలిచాడు. అయినా... శాంతించని గృహలక్ష్మి ఉన్నత న్యాయస్థానానికి వెళ్లింది. అయితే అక్కడ కూడా ప్రశాంత్ నిజాయతీని గుర్తించి... గృహలక్ష్మికి షాకిచ్చే తీర్పు చెప్పింది. ప్రశాంత్ వాదనే కరెక్ట్ అని నిర్ధారించి కింది కోర్టు మంజూరు చేసిన విడాకులు సబబైనవేనని తేల్చిచెప్పింది. దీంతో గృహలక్ష్మి పాచిక పారలేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/