క్రిస్మస్ సందడి పీక్ స్టేజ్ కి వచ్చేసింది. పండుగకు మరో మూడ్రోజులు మాత్రమే ఉండడంతో అంతా పండుగ హడావిడిలో పడిపోయారు. ఈ పండక్కి బంధువులు అంతా ఒకచోటకు చేరడం ఆనవాయితీ. వైజాగ్ లో క్రిస్మస్ జరుపుకునే వాళ్లం అని రీసెంట్ గా హీరోయిన్ అనీషా ఆంబ్రోస్ చెప్పిన సంగతి.. ఇప్పటికే చెప్పుకున్నాం. హీరో ప్రిన్స్ సెసిల్ కి కూడా విశాఖ పట్నంలోనే క్రిస్మస్ ను సెలబ్రేట్ చేసుకోవడం అలావాటని అంటున్నాడు. కోల్కతా.. కేరళ సహా దేశవ్యాప్తంగా ఉన్న తమ చుట్టాలందరూ.. క్రిస్మస్ నాటికి వైజాగ్ చేరుకుంటామని చెబుతున్నాడు ప్రిన్స్.
'పండుగ అంటే బంధువుల సందడితో పాటు..పిండివంటలు కూడా స్పెషల్ అనే విషయం ఒప్పుకోవాల్సిందే. గ్రాండ్ మా చేసే ఫ్రైడ్ రైస్ మా అందరికీ చాలా ఇష్టం. ఇక ప్లమ్ కేక్ కోసం అయితో తెగ పోటీ పడిపోతాం. ముఖ్యంగా కొబ్బరి పాలు పోసి నానమ్మ చేసే ఫిష్ కర్రీ అయితే.. ఇప్పటికీ ఎప్పటికీ నాకు ఫేవరేట్ డిష్' అన్న ప్రిన్స్.. తన 12-13 ఏళ్ల వయసులో ఓసారి క్రిస్మస్ ట్రీ తానే డెకరేట్ చేస్తానని తాతయ్యకు చెప్పాడట. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడ్డా ఒక్కటి కూడా సెట్ చేయలేకపోయాడట. సాయంత్రం తాతయ్య వచ్చి అరగంటలోనే మొత్తం ట్రీ డెకరేట్ చేయడం చూసి ఆశ్చర్యం వేసిందన్నాడు ప్రిన్స్.
తన వర్క్ కమిట్మెంట్స్ కారణంగా గత మూడేళ్లుగా క్రిస్మస్ పండుగ మిస్ అవుతున్నాడట ఈ యంగ్ హీరో. ఈసారి మాత్రం క్రిస్మస్ పండుగను కానీ.. ఆ వేడుకలను కానీ.. అలాగే నానమ్మ ఫిష్ కర్రీని వదిలి పెట్టే సమస్యే లేదని, ఖచ్చితంగా వైజాగ్ వెళ్తానని అంటున్నాడు ప్రిన్స్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/