యాంగ్రీ మ్యాన్ ఎమోషనల్ స్పీచ్

Update: 2019-07-08 07:03 GMT
యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ కు ఇద్దరూ ఆడపిల్లలే కాబట్టి ఆయన వారసత్వం వాళ్ళు తీసుకుని ఒక్కొక్కరుగా పరిశ్రమలో అడుగు పెడుతున్నారు. ఈ నెల 12న ఆయన రెండో కూతురు శివాత్మిక డెబ్యూ మూవీ దొరసాని విడుదలను పురస్కరించుకుని జరిపిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజశేఖర్ చాలా ఓపెన్ గా మాట్లాడటం అందరిని ఆకట్టుకుంది. తన పిల్లలు చిన్నపటి నుంచే సినిమాల్లోకి రావాలని కోరుకున్నారని అయితే అనిష్చితిగా ఉండే పరిశ్రమలో ఒక్కోసారి సక్సెస్ లక్ తో ముడిపడి ఉంటుంది కాబట్టి ముందుగా చదువు పూర్తి చేయమని చెప్పారట.

ఒకవేళ నటిగా ఫెయిల్ అయితే ప్రత్యాన్మయంగా మరో కెరీర్ ఉండాలనే ఉద్దేశంతో జాగ్రత్త తీసుకున్నట్టు చెప్పారు. తన బిడ్డ టాలెంట్ కు లక్ కూడా తోడవుతుందనే నమ్ముతున్నానని చెప్పిన రాజశేఖర్ సినిమా మీద మాత్రం గట్టి నమ్మకం వ్యక్తం చేశారు. వారసత్వ పోకడల గురించి కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. సెలెబ్రిటీల పిల్లలు అయినంత మాత్రాన అన్ని జరిగిపోవని ఎవరికి వాళ్ళు తామెంటో ఋజువు చేసుకోవాలని ఆనంద్ దేవరకొండ శివాత్మికలను ఉద్దేశించి అన్నారు.

ప్రేక్షకులు సినిమా చూసి నచ్చితే దీవించాలని చెప్పిన రాజశేఖర్ మొత్తానికి మంచి క్లారిటీతో మనసులో మాటలు చెప్పి మెప్పు పొందారు. కెవిఆర్ మహేంద్ర దర్శకత్వంలో రూపొందిన దొరసాని ఈ శుక్రవారమే థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఆడియోకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో అంచనాలు మెల్లగా పెరుగుతున్నాయి.


Tags:    

Similar News