టాలీవుడ్ లో చాలామంది హీరోలకు గన్స్ అంటే మహా ఇష్టం. కొంతమంది ఆన్ స్క్రీన్ పై దీన్ని చూపించేస్తుంటారు. రకరకాల గన్స్ ఉపయోగిస్తూ.. తమ టేస్ట్ ను చాటుతూ ఉంటారు. రివాల్వర్స్.. పాయింట్ గన్స్.. మెషీన్ గన్స్.. పిస్టల్స్. డబుల్ బ్యారెల్ గన్స్.. ఇలా బోలెడన్ని గన్స్ మన సినిమాల్లో దర్శనం ఇస్తుంటాయి.
గతేడాది విడుదలైన పవన్ కళ్యాణ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ కోసం అయితే.. ఏకంగా డూప్లికేట్ ఓల్డ్ మోడల్ సింగిల్ షాట్ గన్స్ తయారు చేసేందుకు ఓ వర్క్ షాప్ నే ఏర్పాటు చేశారు. బోలెడంత ఖర్చుపెట్టారు కూడా. గతంలో యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ ఉన్న హీరో రాజశేఖర్ ను.. ఇప్పుడు తుపాకులపై తన ప్రేమ చాటబోతున్నాడు. తాజాగా విడుదలైన "పీఎస్ వీ గరుడ వేగ 126.18ఎం" అనే టైటిల్.. ఓ గన్ పేరు విన్నట్లుగానే ఉంటుంది. ఇది కాకుండా ఫస్ట్ లుక్ పోస్టర్ లో రాసిన 300 వించెస్టర్ మాగ్నం అంటే.. షాట్ గన్స్ లో ఉపయోగించే బుల్లెట్ పేరు.
బెరెట్టా అంటే గన్స్ తయారు చేసే కంపెనీ. మరి గన్స్ పై ఇంత డీటైల్డ్ ప్రేమ హీరో రాజశేఖర్ దో.. లేక దర్శకుడు ప్రవీణ సత్తారుదో తెలియాల్సి ఉంది. జార్జియాలోని పోతీ.. బటుమి పోర్టులలో తీయడం.. బిలిసి.. బటుమి.. బొర్జోమి ప్రాంతాల్లో చిత్రీకరించడంతో.. టాలీవుడ్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుందని అంటున్నారు. హీరో రాజశేఖర్ రియల్ లైఫ్ లో వ్యక్తిగతంగా కూడా తన భద్రత కోసం ఓ గన్ కు లైసెన్స్ కలిగి ఉన్నాడు.