ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలన్నట్టుగా... పేరును చూసి సినిమాకి వెళ్లే పరిస్థితులున్నాయిప్పుడు. మంచి పేరు కుదిరితే చాలు... సగం విజయాన్ని సాధించేసినంత సంబరం చిత్రబృందంలో కనిపిస్తుంటుంది. అందుకే టైటిల్ విషయంలో పెద్దయెత్తున కసరత్తులు జరుగుతుంటాయి. ఒకప్పుడు సినిమా టైటిల్ ఎంత సింపుల్ గా ఉంటే అంత బెటర్ అన్న అభిప్రాయం వ్యక్తమయ్యేది. ఇప్పుడు మాత్రం పెద్ద పెద్ద పేర్లు పెట్టేస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టకుంటున్న ట్రెండ్ నడుస్తోంది. తాజాగా రామ్ కూడా ఓ పెద్ద టైటిలే పట్టేశాడు. కానీ అది భలే క్యాచీగా ఉంది.
ఆ టైటిల్ వినగానే సినిమాలో సమ్ థింగ్ ఉండే ఉంటుందన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో కలుగుతోంది. దీన్నిబట్టే రామ్ టైటిల్ విషయంలో సక్సెస్ అయ్యాడన్న విషయం అర్థమవుతుంది. ఇంతకీ రామ్ సినిమా టైటిల్ పేరేంటో చెప్పలేదు కదూ! ఆ టైటిల్.. `ఉన్నది ఒక్కటే జిందగీ`. నేను శైలజ తర్వాత ఆ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రానికే ఈ టైటిల్ ఫిక్స్ చేశారు. నేను శైలజతో రామ్ ని కొత్తగా చూపెట్టిన దర్శకుడు కిషోర్ తిరుమల మరోసారి అదే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. మరి ఈసారి సినిమాలో రామ్ ఎలా దర్శనమిస్తాడు, ఎలా హంగామా చేస్తాడన్నది చూడాలి.