బాత్రూమ్ లో ఆరు పల‌క‌ల్ని చూపిస్తున్న హీరో

Update: 2021-10-16 13:42 GMT
బాలీవుడ్ ఫ్యాష‌నిస్టాగా స్టైలిష్ ఐకన్ గా పాపుల‌ర‌య్య‌డు ర‌ణ‌వీర్ సింగ్. త‌న‌దైన ఎన‌ర్జీ లేటెస్ట్ ఫ్యాష‌న్స్ తో యువ‌త‌రంలో నిరంత‌రం అత‌డు హాట్ టాపిక్. బాలీవుడ్ లో ఖాన్ ల త‌ర్వాత‌ అతిపెద్ద స్టార్లలో ర‌ణ‌వీర్ ఒకరు. అతను సోషల్ మీడియాలో కూడా బాగా ప్రాచుర్యం పొందాడు. నిరంత‌రం ఇన్ స్టా వేదిక‌గా అత‌డు వెరైటీ ప్ర‌చారాన్ని కోరుకుంటాడ‌న్న సంగ‌తి తెలిసిందే. విభిన్న‌మైన ఫోటోలను అత‌డు షేర్ చేస్తుంటాడు ర‌ణ‌వీర్.

అలాంటి ఒక ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ ను బ్రేక్ చేస్తోంది. రణ్ వీర్ బాత్ రూమ్ సెల్ఫీలో తన హాట్ బాడీ ని వాష్ బోర్డ్ యాబ్స్ ను ప్రదర్శిస్తున్నాడు. ప్ర‌తిసారీ అత‌డిలో మ్యాన్ లీ నెస్ ని  వెరైటీ అవతార్ ను అమ్మాయిలు ఇష్టపడుతున్నారు. బోయ్స్ అయితే ప్రధాన ఫిట్ నెస్ గోల్స్ విష‌యంలో స్ఫూర్తిని పొందుతున్నారు.  కపిల్ దేవ్ బయోపిక్ 83 లో ర‌ణ‌వీర్ కనిపించనున్నాడు. వ‌రుస‌గా భారీ చిత్రాల్లో అత‌డు న‌టిస్తున్నాడు.

83 రిలీజ్ కోసం రెండేళ్లుగా వెయిటింగ్

బాలీవుడ్ లో ఇప్ప‌టికే ప‌లు క్రీడా బ‌యోపిక్ లు బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న‌విజ‌యం సాధించాయి. అదే కేట‌గిరీలో రాబోతున్న మ‌రో సినిమా 83. క్రికెట్ నేప‌థ్యంలో చిత్ర‌మిది. 1983 వ‌ర‌ల్డ్ క‌ప్ విక్ట‌రీలో టీమిండియా కెప్టెన్ క‌పిల్ దేవ్ పాత్రను.. టీమిండియా విక్టరీని తెర‌పై ఆవిష్క‌రిస్తున్నారు. ర‌ణ‌వీర్ సింగ్   క‌పిల్ పాత్ర‌లో న‌టిస్తుండ‌గా అత‌డి భార్య `రోమి దేవ్` (Romi-Dev) పాత్ర‌లో రియల్ వైఫ్‌ దీపిక ప‌దుకొనే న‌టిస్తోంది. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు నిర్మాతలు విష్ణువర్ధన్ ఇందూరి- మధు మంతెన- దీపిక‌ సంయుక్తంగా నిర్మిస్తుండ‌గా నాగార్జున స‌మ‌ర్పిస్తున్నారు. 2020 ఏప్రిల్ 10న విడుద‌ల కావాల్సిన సినిమా క‌రోనా వ‌ల్ల ప‌లుమార్లు వాయిదా ప‌డింది. 83 ఫ‌స్ట్ లుక్ స‌హా టీజ‌ర్ రిలీజై ఇప్ప‌టికే ఆక‌ట్టుకున్నాయి. క‌పిల్ పాత్ర‌లోకి ర‌ణ‌వీర్ ఒదిగిపోయి న‌టించాడ‌ని స‌మాచారం. ఇక ఈ సినిమాకి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తూనే.. క‌పిల్ వైఫ్ రోమీ పాత్ర‌లో దీపిక న‌టించారు. రోమీ లుక్ కి ఫ్యాన్స్ లో అద్భుత స్పంద‌న వ‌చ్చింది.

గ‌వాస్క‌ర్ పాత్ర‌కు బిగ్ స్కోప్

తాహిర్ రాజ్ భాసిన్ ఈ చిత్రంలో లిటిల్ మాస్ట‌ర్ గ‌వాస్క‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. 1983 వ‌ర‌ల్డ్ క‌ప్ విక్ట‌రీలో క‌పిల్ తో పాటుగా కీల‌క పాత్ర‌ధారిగా గ‌వాస్కర్ పేరు రికార్డుల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. అతడి లుక్ కి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. దీపిక ప‌దుకొనే- ష‌కీబ్ స‌లీం-తాహిర్ రాజ్ భాసిన్-హార్డీ సంధు- అమృత పురి- విర్క్ - జీవా- సాహిల్ ఖ‌త్త‌ర్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. 83 తో దీప్ వీర్ డ్రీమ్ ని నెర‌వేరుస్తుందా లేదా అన్న‌ది చూడాలి. భ‌ర్త‌తో క‌లిసి న‌టిస్తున్న ఈ మూవీ నిరాశ‌ప‌ర‌చ‌కుండా సెంటిమెంటుగా హిట్ట‌వుతుందనే భావించాలి.
Tags:    

Similar News