సోషల్ మీడియాలో ఇష్టానుసారం పెట్రేగుతున్న నెటిజనులకు హీరో సూర్య తనదైన స్టైల్లో క్లాస్ తీస్కోవడం చర్చకొచ్చింది. ఎన్ జీకే చిత్రం ఈనెల 31న రిలీజవుతున్న సందర్భంగా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ ప్రీరిలీజ్ వేడుకలో పాల్గొన్న సూర్య వేదికపై అద్భుతమైన స్పీచ్ తో అలరించారు. నిన్నటిరోజున ఓ ఇంటర్వ్యూలో ``సీఎం జగన్ అన్నా`` అంటూ మాట్లాడిన సూర్య యంగ్ సీఎం వైయస్ జగన్ తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సాయంత్రం ప్రీరిలీజ్ వేడుక (హైదరాబాద్) లోనూ ఆయన స్పీచ్ అంతే మైమరిపించింది.
సోషల్ మీడియా ప్రబుద్ధులపై సూర్య ఏమన్నారు? అంటే.. ఫ్యాన్స్ కి నేను ఎలాంటి సలహా ఇవ్వాలనుకోవడం లేదు. కానీ ఒకటి చెబుతాను. మనం ఎప్పుడూ ఇతరులు ఏం చేస్తున్నారు? వారిలో తప్పు ఏమిటి? అని వెతుకుతూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు గుప్పిస్తూ సమయం వృధా చేస్తున్నాం. అలా విమర్శించే ముందు మనల్ని మనం విమర్శించుకోవాలి. మనం ఏం తప్పు చేస్తున్నామో తెలుసుకోవాలి. ఆత్మ విమర్శ చేసుకోవాలి. అప్పుడే మనం ఉన్నత స్థానాలకు వెళ్లగలం`` అని ఫుల్ గా క్లాస్ తీస్కున్నారు. దేశం నీకేం చేసింది కాదు.. దేశానికి నువ్వేం చేశావన్నది ఇంపార్టెంట్.. ప్రభుత్వం మనకు ఏం చేస్తోంది? అనేదాని కంటే దేశం కోసం .. రాష్ట్రం కోసం.. ప్రజల కోసం మనం ఏం చేస్తున్నామన్నది చాలా చాలా ముఖ్యం. ఇదే విషయాన్ని ఎన్‌జీకే చిత్రంలో చూపిస్తున్నామని సూర్య తెలిపారు. వ్యవస్థలో మార్పునకు వ్యక్తిగా ఏం చేయాలనేది గుర్తించాలి. ఆ తర్వాతనే ప్రభుత్వాన్ని వేలెత్తి చూపాలని అన్నారు. బూటాన్ లో ఇది అమలవుతోంది. మన దేశంలోనూ ఇదే చేయాలని సూర్య ఆకాంక్షించారు. దేశంలో 2.5 శాతం మందికే ప్రభుత్వాల మ్యానిఫెస్టోపై అవగాహన ఉంది. ప్రజల్ని మార్చాల్సిన అవసరం ఎంతయినా ఉందని సూర్య అన్నారు. తెలంగాణలో కేసీఆర్ పాలన బావుంది. జగన్ ని అన్నా అని పిలుస్తానని ఈ సందర్భంగా తెలపడం ఆసక్తికరం.
ఏడాదిన్నర తర్వాత మీ ముందుకు వస్తున్నా. మీలాగానే నేను కూడా శ్రీరాఘవగారికి పెద్ద ఫ్యాన్ ని. అందుకే ఆయనతో ఈ సినిమా చేశాను. సినిమా చూసే ప్రేక్షకులకు ఇది యూనిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుంది. నా జీవితంలో శ్రీరాఘవగారు స్పెషల్ పర్సన్. 18 ఏళ్లు ఆయనతో పని చేయాలని వెయిట్ చేశాను. శ్రీరాఘవ- యువన్ మ్యాజికల్ కాంబోలో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. మే 31న ప్రేక్షకులన అంచనాలను అందుకుంటాం.. అని అన్నారు.