బాల నటుడిగా ఎన్నో చిత్రాల్లో నటించిన తనీష్ హీరోగా ఎంట్రీ ఒకటి రెండు చిత్రాలతో తప్ప పెద్దగా ఆకట్టుకోలేక పోయాడు. అయినా కూడా హీరోగా ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కాని ఏ ఒక్కటి కూడా కలిసి రాలేదు. తాజాగా ఈయన తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొనడంతో మరోసారి తనీష్ గురించి సినీ జనాలు మరియు ప్రేక్షకులు చర్చల్లోకి వచ్చాడు. దాంతో ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న తనీష్ ‘రంగు’ చిత్రాన్ని తాజాగా విడుదల చేసేందుకు సిద్దం అయ్యాడు.
బిగ్ బాస్ తో తనీష్ కు వచ్చిన క్రేజ్ తమ సినిమాకు ప్లస్ అవుతుందని చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నారు. ఇక ఈ చిత్రం తన కెరీర్ లో ఒక మంచి చిత్రంగా నిలుస్తుందనే నమ్మకంను తనీష్ కూడా వ్యక్తం చేస్తున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత నేను చేసిన సినిమా ఫలితం కోసం ఎదురు చూస్తున్నానన్నాడు. ఈ చిత్రం విజయవాడ రౌడీ షీటర్ లారా జీవిత కథ ఆధారంగా తెరకెక్కించడం జరిగింది. లారా అనే వ్యక్తి ఐడియాలజీ చాలా బాగుంటుంది. కాని ఆయన ఎంచుకున్న మార్గం - ఆయన వెంట నడిచిన వ్యక్తుల వల్ల ఆయన సమాజంలో మరో రూపంలో ప్రదర్శింపబడ్డాడు.
రంగు సినిమా చివర్లో చాలా ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. తెల్లారితే పాప పుట్టి తండ్రి కాబోతున్న లారాను ఆ రాత్రి చంపేశారు. ఆ సీన్ చూసిన మా అమ్మ చాలా ఏడ్చేసిందని, అంతా కూడా ఆ సీన్ కు కంట తడి పెట్టుకుంటారని తనీష్ పేర్కొన్నాడు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తనీష్ కు సక్సెస్ ను తెచ్చి పెట్టేనా చూడాలి.