బ్లైండ్ గానే..మైల్డ్ గా ఉంటే! ఉపేంద్ర‌ని త‌ట్టుకోలేరు?

Update: 2022-09-13 02:30 GMT
టాలీవుడ్ లో ఉపేంద్ర క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. క‌న్న‌డ న‌టుడైనా తెలుగు న‌టుడిలా నీరాజ‌నాలు అందుకోవ‌డం ఆయ‌న‌కే చెల్లింది. కేవ‌లం త‌న న‌ట‌న‌తోనే ఇది సాధ్య‌మైంది. భిన్న‌మైన పాత్ర‌లు..యాటిట్యూడ్ తోనే టాలీవుడ్ ఆడియ‌న్స్ కి ద‌గ్గ‌ర‌య్యారు. ఇప్పుడంటే  స‌హాయ పాత్ర‌ల్లో క‌నిపిస్తున్నారు గానీ..ఒక‌ప్పుడు ఉపేంద్ర అంటే ఓ సెక్ష‌న్ ఆడియ‌న్స్ లో ఓ ఊప‌సు తీసుకొచ్చేది.

ఉప్పీకంటూ ప్ర‌త్యేక‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఉపేంద్ర సినిమాలో కోసం ఎదురుచూస్తే ఆడియ‌న్స్ ఎంతో మంది. ఆయ‌న జ‌ర్నీ కూడా ఎంతో స్పూర్తి దాయ‌కం. అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా కెరీర్ ప్రారంభించి న‌టుడిగా ఎదిగారు. ఎదిగే క్ర‌మంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కున్నారు. కాలే క‌డుపుతో నిద్రించిన రోజులెన్నో ఉన్నాయి. త‌న‌ను పొమ్మ‌ని చెప్పిన ప్రొడ‌క్ష‌న్ బాయ్ నే ఇప్పుడు త‌ను హీరోగా న‌టిస్తోన్న సినిమాల‌కు అదే ప‌నిచేస్తున్నాడు.

ఎద‌గ‌డం అంటే ఇదీ అని ఎదిగి చూపించిన న‌టుడాయ‌న‌. క‌థ‌ల ప‌రంగా...పాత్ర‌ల ప‌రంగా ఉపేంద్ర ఎందుకంత డిఫ‌రెంట్ గా థింక్ చేస్తార‌ని ఓ ఇంట‌ర్వ్యూలో ప్ర‌శ్నిస్తే ఉప్పీ ఆస‌క్తిక‌ర‌ బ‌ధులిచ్చారు. తానెప్పుడు ఆడియ‌న్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా ని చూస్తాన‌ని... అత‌ని కోణంలో త‌న క‌థ సిద్దం చేసే ప్ర‌యాణం మొద‌ల‌వుతుంద‌న్నారు.

ఆ విధంగానే ప్రేక్ష‌కుల‌కు త‌న పాత్ర‌ల‌కి క‌నెక్ట్ అయ్యార‌ని చెప్పుకొచ్చారు. ముందుగా వ‌ర్కౌట్ అవుతుందో లేదో త‌న‌కి తె లియ‌ద‌ని.. కొన్ని విష‌యాల్లో బ్లైండ్ గా వెళ్తాన‌ని....అలా కాకుండా మైల్డ్ గా వెళ్లి ఉంటే ఉపేంద్ర‌ని త‌ట్టుకోవ‌డం ప్రేక్షకుల వ‌ల్ల కాదంటూ న‌వ్వేసారు. నిజ‌మే ఉపేంద్ర కొన్ని పాత సినిమాల విష‌యంలో ఆ బ్లైండ్ నెస్ ని ఫాలో అవ్వ‌క‌పోతే క‌నెక్ట్ అవ్వ‌డం క‌ష్టం.

మ‌హిళా వ్య‌తిరేకి...వ్య‌వ‌స్థ‌లంటే వెట‌కారం చేసే వేదాంతి అంటూ అప్ప‌ట్లో  కొన్ని ర‌కాల విమ‌ర్శ‌లు ఓ సెక్ష‌న్ ఆడియ‌న్స్ నుంచి ఎదుర్కున్నారు. కానీ మెజార్టీ వ‌ర్గం ఉపేంద్ర ప‌క్షాన నిల‌బ‌డ‌టంతో  అవి అంత బ‌లంగా నిలబ‌డ‌లేక‌పోయాయి. లేదంటే ఉపేంద్ర‌పై మ‌హిళా సంఘాలు భ‌గ్గుమ‌నేయ‌వు. తాజాగా అమెరికాలా? ఇండియా ఎందుకు మార‌లేదంటూ ఓ సెటైరిక‌ల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

త‌న‌దైన శైలిలో  సైటైర్లు గుప్పించబోతున్నారు. మ‌రి అమెరికా-ఇండియా మ‌ధ్య వ్య‌త్యాసాన్ని ఎలా బ్యాలెన్స్  చేస్తారో చూడాలి. ఇంకా ఉపేంద్ర చేతిలో కొన్ని సినిమాలున్నాయి. న‌టుడిగా కొన‌సాగుతూనే ద‌ర్శ‌కుడిగా రాణిస్తున్నారు.  ఇంకొన్ని సినిమాలు స్వీయా ద‌ర్శ‌క‌త్వంలోనూ చేస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News