విక్టరీ వెంకటేష్‌లో రకరకాల షేడ్స్ గురించి అభిమానుల్లో నిరంతరం ఆసక్తికర చర్చ సాగుతుంది. వృత్తిగత జీవితం అటుంచితే వ్యక్తిగతంగా వెంకీలోని ధార్మికత, ఆధ్యాత్మికతపైనా ఆసక్తిగా మాట్లాడుకుంటారు. వివేకానంద.. రామకృష్ణ పరమహంస బోధనల ప్రభావం ఆయనపై ఎంతో ఉంది. ధనార్జనే ధ్యేయంగా బంధాలు- అనుబంధాల్ని కడతేర్చే మనిషి లోకానికి ఒత్తిడి నుంచి బయటపడే టిప్స్ ఎన్నో ఆయన్ని కలిస్తే చెబుతుంటారు.
ఆ ఒక్క కోణమే కాదు.. అభిమానుల కోసం మానవత్వంతో స్పందించే స్వభావం ఆయనలో మెండు. తాజాగా ఆయన క్యాన్సర్ తో బాధపడుతున్న తన అభిమానిని పరామర్శించి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఎల్.బి.నగర్ కి చెందిన తన అభిమాన సంఘానికి ఉపాధ్యక్షుడిగా పని చేస్తున్న సురేష్ లివర్ క్యాన్సర్ తో బాధ పడుతున్నారు. పూర్తిగా చిక్కి శల్యమైన దశలో అతడికి ఇంకా ఖరీదైన ట్రీట్ మెంట్ కొనసాగుతోంది. సురేష్ - వెంకీకి వీరాభిమాని. తన అభిమాని వేగంగా కోలుకోవాలని వెంకీ ఆ కుటుంబానికి అండగా నిలుస్తున్నారట.
వెంకీ వృత్తిగతంగా ప్రస్తుతం ఎంత బిజీగా ఉన్నారో తెలిసిందే. ఇటీవలే ఎఫ్ 2 చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయం అందుకుని రెట్టించిన ఉత్సాహంలో ఉన్నారు. అటుపై వెంకటేష్ - నాగచైతన్య కథానాయకులుగా వెంకీ మామ ప్రస్తుతం శరవేగంగా పూర్తవుతోంది. ఈ సినిమా షూటింగ్ లో వెంకీ చాలా బిజీగా ఉన్నారు. చిన్న గ్యాప్ లో ఇలా తన అభిమానిని పరామర్శించి ధైర్యం చెప్పారు. గతంలోనూ వెంకీ ఎన్నోసార్లు తన అభిమానులను కలిసి ఆపదలో ఆదుకున్న సందర్భాలున్నాయి.