విమానం రెక్కపై ఘోరమైన స్టంట్ చేసిన హీరో

Update: 2021-11-30 13:30 GMT
హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ ఇటీవల తన త‌దుప‌రి చిత్రం మిషన్: ఇంపాజిబుల్ 8లో డెత్-ఫైయింగ్ స్టంట్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఫాక్స్ న్యూస్ లోని ఒక క‌థ‌నం ప్రకారం.. యాక్ష‌న్ హీరో టామ్ క్రూజ్ 1941 బోయింగ్ B75N1 స్టీర్ మ్యాన్ బైప్లేన్ కాక్ పిట్ నుండి 2000 అడుగుల ఎత్తులో ఎక్కి రెక్కపై కూర్చున్నాడు. ఆ తర్వాత రెక్కల నుంచి తలకిందులుగా వేలాడాడు. క్రూజ్ తలక్రిందులుగా వేలాడే క్ర‌మంలో 80 ఏళ్ల నాటి యుద్ధ విమానం తలక్రిందులుగా పల్టీలు కొట్టింది. గ‌గుర్పొడిచే విన్యాసం తద్వారా అతను రెక్కపై నిటారుగా కూర్చున్నాడు. ఇది నిజంగా షాక్ ని క‌లిగించే ఫీట్.

మిషన్: ఇంపాజిబుల్ 8లో తన పాత్ర కోసం అంతర్జాతీయ స్టార్ ఫ్లైయింగ్ పాఠాలు నేర్చుకుంటున్నాడు. మిషన్ ఇంపాజిబుల్ 7ని పూర్తి చేసిన తర్వాత టామ్ ఈ చిత్రం షూటింగ్ ను ప్రారంభించాడు. రెండు సినిమాలు ఒకేసారి ప్రకటించారు. మిష‌న్ ఇంపాజిబుల్ 7 కోసం టామ్ చాలా సాహ‌సాలు చేశారు. ఇక ఈ సినిమాల్లో ఒకటి 2022లో మరొక‌టి 2023లో విడుదల కానుంది. దురదృష్టవశాత్తూ.. కోవిడ్-19 మహమ్మారి కారణంగా మిషన్ ఇంపాజిబుల్ 7 షూటింగ్ వాయిదా వేయాల్సి వచ్చింది. షూటింగ్ లో జరిగిన ఈ జాప్యం మిషన్: ఇంపాజిబుల్ 8 అంచనా విడుదల తేదీని 2023 జూలైకి కూడా వాయిదా వేయ‌డానికి కార‌ణ‌మైంది.

టామ్ క్రూజ్ డెడ్ డ్రాపింగ్ యాక్షన్ సన్నివేశాలకు ప్రసిద్ధి చెందాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అతను ఈ సన్నివేశాలన్నింటినీ బాడీ డబుల్ ఉపయోగించకుండా స్వయంగా ప్రదర్శించాడు. ఇంతకుముందు టామ్ `ది గ్రాహం నార్టన్ షో`ని అలంకరించినప్పుడు, అతను యాక్షన్ సన్నివేశాలను ప్రదర్శించడం లో తన ప్రేమను దాచుకోలేదు. నేను ఫిట్ యాక్ష‌న్ హీరోని. వాటిని చేయడం నాకు చాలా ఇష్టం. నేను చదువుకుంటాను.. శిక్షణ తీసుకుంటాను. సమయానికి అన్నింటినీ గుర్తించాను. నాకు చాలా ఎముకలు విరిగిపోయాయి. ఏదైనా స్టంట్ మొదటిసారి నరాలు తెగిపోయేలా ఉంటుంది. కానీ అది ఉత్తేజాన్నిస్తుంది. ఒక స్టంట్ షూటింగ్ సమయంలో నవ్వకుండా ఉండమని నాకు కొన్ని సార్లు చెప్పారు.. అంటూ త‌న‌లోని సాహ‌సిని బ‌య‌ట‌పెట్టాడు. 59 ఏళ్ల వయసులో టామ్ క్రూజ్ ఖచ్చితంగా యువ నటులకు స్ఫూర్తి నింపుతున్నార‌నే చెప్పాలి.


Tags:    

Similar News