బాలయ్య అంటే సెకండ్ గ్రేడేనా?

Update: 2020-03-25 01:30 GMT
గతం లో నందమూరి బాలకృష్ణకు వరుసగా ఎన్ని ఫ్లాపులు వచ్చినా.. ఆయనకంటూ ఓ రేంజ్ ఉండేది. 'లక్ష్మీ నరసింహా' తర్వాత 8-9 ఏళ్ల పాటు సరైన సక్సెస్ లేకుండా సాగిపోయినపుడు కూడా బాలయ్య పెద్ద పెద్ద దర్శకులు, హీరోయిన్లతోనే సినిమాలు చేశాడు. ఒక స్థాయి మెయింటైన్ చేశాడు. కానీ ఈ మధ్య బాలయ్య రేంజ్ బాగా దెబ్బ తినేసింది. ఆయనకు వయసు మళ్లింది. పైగా విజయాలు లేవు. వరుస డిజాస్టర్లు ఆయన మార్కెట్‌ను బాగా దెబ్బ తీశాయి. దీంతో ఓ మోస్తరు స్థాయి ఉన్న హీరోయిన్లను కూడా బాలయ్య సినిమాల్లో పెట్టుకునే అవకాశం లేకపోతోంది. అవకాశాలు లేని, ఔట్ డేట్ అయిపోయిన కథానాయికల్నే ఎంచుకోవాల్సి వస్తోంది. పోయినేడాది బాలయ్య చేసిన 'రూలర్' సినిమా కోసం వేదిక, సోనాల్ చౌహాన్ లాంటి హీరోయిన్లను తీసుకున్నారు.

బాలయ్య తర్వాతి సినిమా బోయపాటి శ్రీను దర్శకత్వం లో కాబట్టి పరిస్థితి మెరుగుపడుతుంది.. ఈ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా హీరోయిన్ల విషయంలో రేంజ్ మెయింటైన్ చేస్తారనుకుంటే.. ముందు అంజలి లాంటి ఔట్ డేటెడ్ హీరోయిన్ని తీసుకున్నారు. ఇంకో కథానాయిక కోసం వెతుకులాడి వెతుకులాడి చివరికి శ్రియను ఓకే చేశారట. ఇప్పటికే బాలయ్యతో శ్రియ నాలుగు సినిమాలు చేసింది. గత మూడేళ్లలోనే రెండుసార్లు జత కట్టింది. ప్రస్తుతం ఆమెను చిన్న సినిమాలకు కూడా కన్సిడర్ చేయట్లేదు. ఆమెలో ఏమాత్రం గ్లో లేదిప్పుడు. లైమ్ లైట్లో లేని అలాంటి కథానాయికను బాలయ్య కోసం ఎంచుకోక తప్పని పరిస్థితి రావడం నందమూరి అభిమానులకు ఏమాత్రం రుచించట్లేదు. హీరోయిన్ల పరంగా ఈ సినిమాలో ఏమాత్రం ఎగ్జైట్మెంట్ ఉండబోదన్నది వాస్తవం. మరి కంటెంట్‌ తో బోయపాటి ఏ మేర మెప్పిస్తాడో చూడాలి.
Tags:    

Similar News