'కలర్ ఫోటో' సినిమాతో సూపర్ హిట్ కొట్టేసింది హీరోయిన్ చాందినీ. ఆ సినిమాతో చాందినీ చౌదరికి నటిగా మంచి గుర్తింపు వచ్చింది. ఈ మూవీ సక్సెస్ తో చాందినీకి మంచి ఆఫర్లు వస్తున్నాయి. లేటెస్ట్ గా.. ఆమె నటించిన చిత్రం 'సూపర్ ఓవర్'. ఈ మూవీ విడుదలకు సిద్దంగా ఉంది. అయితే.. తాజాగా నిర్వహించిన ఈ మూవీ ఈవెంట్‌లో మాట్లాడిన చాందినీ స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకుంది.
క్రికెట్ బెట్టింగ్‌ల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించారు. ఈ మూవీ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో.. నిన్న మీడియాతో ముచ్చటించింది యూనిట్. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం వెనుక ఓ విషాదం ఉంది. ఈ మూవీని తెరకెక్కిస్తున్న సమయంలోనే చిత్ర దర్శకుడు ప్రవీణ్ మృతిచెందారు.
ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే దర్శకుడు ప్రవీణ్ చనిపోయారు. సినిమా షూటింగ్‌లో భాగంగా వెళ్తున్న ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ సమయంలో యూనిట్ మొత్తం తీవ్ర ఆవేదనలో కూరుకుపోయింది. చివరకు.. దర్శకుడు లేకపోయినప్పటికీ ఆయన కలను నిజం చేసేందుకు యూనిట్ మొత్తం కలిసి పని చేసింది.
ఈ సందర్భంగా దర్శకుడిని తలుచుకుని చాందినీ ఎమోషనల్ అయ్యింది. క్రికెట్ బెట్టింగ్ మీద ప్రవీణ్ ఈ చిత్రాన్ని బాగా తీశాడని, ఇది అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని అన్నారు. ఈ మూవీ ప్రవీణ్‌కే అంకితమని చెబుతూ చాందినీ స్టేజ్ మీద కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో.. పక్కనే ఉన్న నవీన్ చంద్ర ఆమెను ఓదార్చాడు. ప్రవీణ్ చనిపోయిన తరువాత ఈ సినిమాను అందరి ముందుకు తీసుకొచ్చేందుకు సుధీర్ చేసిన ప్రయత్నానికి హ్యాట్సాఫ్ అని అన్నాడు.