ధనుష్ 'సార్' గొడవపై హీరోయిన్ కామెంట్

Update: 2022-07-28 11:30 GMT
ఒక సినిమా చిత్రీకరణ సమయంలో వాదనలు లేకుండా ఏ పని కూడా పూర్తికాదు అనే చెప్పాలి. విభిన్నమైన అభిప్రాయాలు వ్యాకథమవుతుంటాయి కాబట్టి కొన్నిసార్లు వాదనలు ప్రతిపాదనలుగా మారి గొడవలకు కూడా దారితీస్తూ ఉంటాయి. దీంతో కొంతమంది అసంతృప్తితోనే ప్రాజెక్టుల నుంచి మధ్యలో కూడా బయటకు వచ్చేస్తుంటారు.

ఇక హీరో హీరోయిన్ మధ్యలో కూడా అప్పుడప్పుడు గొడవలు జరగడం సహజమే అనే వార్తలు కూడా వస్తూ ఉంటాయి. ఇక ఎందుకో ఏమో గాని ధనుష్ తో కూడా ఒక హీరోయిన్ గొడవపడే షూటింగ్ చేసిన రెండు రోజులకే ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు కూడా ఆ మధ్య ఒక టాక్ అయితే వినిపించింది. ఆ తర్వాత దర్శకుడు నిర్మాతలు మాట్లాడి మళ్ళీ వారిద్దరిని కలిపినట్లు కూడా వార్తలు వచ్చాయి.

కానీ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ హీరోయిన్ ఆ వార్తల పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆమె మరెవరో కాదు ధనుష్ సార్ సినిమాలో నటిస్తున్న సంయుక్తా మేనన్. భీమ్లా నాయక్ సినిమాలో రానా దగ్గుపాటికి జోడిగా నటించిన సంయుక్తా మేనన్ ఆ తర్వాత తెలుగులో మంచి ఆఫర్లు అయితే అందుకుంటోంది.

ఈ క్రమంలో ఆమెకు ద్విభాషా చిత్రంగా తెరపైకి రాబోతున్న ధనుష్ సార్ సినిమాల్లో కూడా అవకాశం వచ్చింది.

అయితే షూటింగ్ మొదలైన రెండు రోజులకే ఆమెకు ధనుష్ కు మధ్యలో గొడవలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదు అని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ తెలియజేసింది.

సార్ సినిమాకు నేను 17 రోజుల షెడ్యూల్ ఇచ్చాను అని ఇప్పటికే నా వర్క్ పూర్తయిందని ఒక పాట షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది అని ఈ బ్యూటీ తెలియజేసింది. అలాగే మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో సెకండ్ హీరోయిన్బజ్ నటించబోతున్నట్లు వస్తున్న వార్తల్లో కూడా ఎలాంటి నిజం లేదని సంయుక్తా మేనన్ తేల్చి పారేసిందే.
Tags:    

Similar News