సినిమాలో పాత్రల ఎంపిక విషయంలో ఈ మధ్య రూమర్స్ పలు రకాలుగా వస్తున్న సంగతి తెలిసిందే. అసలు చిత్ర యూనిట్ సెలెక్ట్ చేసిందో లేక ఆలోచిస్తుందో అనే విషయం తెలియక కొన్ని మీడియా సంస్థలు ఎవరికీ తోచినట్టుగా వారు రూమర్లే నిజాలని చెప్పేస్తున్నారు. అయితే అన్ని సార్లు రూమర్లు నిజం కాలేవు. అదే తరహాలో ఇప్పుడు వెంకటేష్ - తేజ కాంబినేషన్ లో వస్తోన్న చిత్రం గురించి ఎన్నో కన్ఫ్యూజన్ రూమర్స్ వస్తున్నాయి.
నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మంచి విజయం అందుకున్నతేజ వెంకీతో ఒక సినిమాను చేయడానికి సిద్దమైన సంగతి తెలిసిందే. ఆ సినిమాపై ప్రస్తుతం ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. అయితే సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా ముఖ్యం. ఎందుకంటే ఇద్దరు పిల్లలకు తల్లిగా కనిపించాలి. అందుకు మొదట కాజల్ ని ఒకే చేశారు. కానీ ఆమె బిజీ షెడ్యూల్ వల్ల అలాగే రెమ్యునరేషన్ కారణాల వల్ల ఒప్పుకోలేదని కొన్ని వార్తలు వచ్చాయి.
ఇక ఆమె స్థానంలో అదితి హైదరిని ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరిగింది. కానీ ఆమె కూడా కాదని మరో రకం రూమర్స్ వచ్చాయి. ఏ హీరోయిన్ కాదని దర్శకుడు కొత్త హీరోయిన్స్ ని సలెక్ట్ చేసే పనిలో పడ్డాడని నిన్నటివరకు వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఫైనల్ గా మళ్లీ కాజల్ అంటున్నారు. చిత్ర యూనిట్ ఈ తరహా కన్ఫ్యూజన్ లో ఉందా లేక రూమర్స్ క్రియేట్ అవుతున్నాయా అనే విషయం ఎవ్వరికి అర్ధం కావడం లేదు. మరి ఇద్దరి పిల్లల తల్లి హీరోయిన్ ఎవరో తెలియాలంటే దర్శకుడు తేజనే క్లారిటీ ఇవ్వాలి.