ఐటమ్ సాంగ్ అంటే ప్రత్యేకంగా ఓ వర్గం నటీమణులు మాత్రమే వుండేవారు. అప్పట్లో అయితే జ్యోతిలక్ష్మి, జయమాలిని, సిల్క్ స్మిత, అనురాధా, జయలలిత, అభినయశ్రీ.. కానీ ట్రెండు మారింది. ఐటమ్ సాంగ్ అంటే ఇప్పడు స్టార్ హీరోయిన్‌లు క్యూ కట్టేస్తున్నారు. దీంతో ఐటమ్ భామలు దాదాపుగా తెరమరుగైపోయారు. ఈ పాటల్లో మొదట్లో ఎక్కువగా సౌత్ భామలు.. తెలుగు వాళ్లే వుండేవారు. కానీ ఇప్పుడు కథే మారిపోయింది. హీరోయినే ఐటమ్ పాపగా మారిపోతోంది.
ఐటమ్ సాంగ్ లకు క్రేజ్ పెరిగిపోవడంతో స్టార్ హీరోయిన్ లే ఐటమ్ సాంగ్ లకు కేరాఫ్ అడ్రస్ లుగా మారుతున్నారు. ఇప్పటి వరకు క్రేజీ హీరోయిన్ లు సమంత, కాజల్, తమన్నా, రెజీనా ఐటమ్ గీతాల్లో చిందేశారు. వీరు చేసిన పాటలు ఓ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో హీరోయిన్ ల ఐటమ్ సాంగ్ లకు ఇప్పుడు డిమాండ్ పెరిగింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన `జనతా గ్యారెజ్`తో కాజల్ అగర్వాల్ ఐటమ్ గాళ్ గా మారింది. ఈ పాట కోసం కాజల్ 50 లక్షలు తీసుకుంది. సినిమాలో కాజల్ చేసిన ఈ పాట ఓ రేంజ్ లో రచ్చ చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత తమన్నా ప్రత్యేక గీతాల్లో ఎక్కువగా మెరిసింది. అల్లుడు శ్రీను, స్పీడున్నోడు, జై లవకుశ, జాగ్వర్, కేజీఎఫ్ చాప్టర్ 1 చిత్రాల్లోని ప్రత్యేక గీతాల్లో మెరిసింది. తమన్నా కేజీఎఫ్ కు అందుకున్న రెమ్యునరేషన్ 40 లక్షలు మాత్రమే.
రీసెంట్ గా సమంత కూడా ఐటమ్ పాపల జాబితాలో చేరింది. బన్నీ నటించిన `పుష్ప` కోసం `ఊ .. అంటావా మావ ఊఊ అంటావా..` అంటూ సమంత చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఈ పాట కోసం బన్నీతో కలిసి సమంత చేసిన హల్‌చల్ చూసిన బాలీవుడ్ మేకర్స్ ఇదే తరహా గీతాల కోసం సమంతకు భారీ ఆఫర్లు ఇస్తున్నారట. `ఊ .. అంటావా..` కోసం సమంత అందుకున్న పారితోషికం 1.2 కోట్లు. ఇది ఇప్పటి వరకు ఐటమ్ సాంగ్ ల పరంగా రికార్డుగా చెబుతున్నారు.
అన్నట్టు సమంత స్టార్ డైరెక్టర్ గుణ్ శేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ప్రేమ కావ్యం `శాకుంతలం`ని పూర్తి చేసింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ మూవీ వర్క్ ఫినిష్ కావడంతో సామ్ `యశోద` చిత్రంలో నటిస్తోంది. గురువారం అంటే జనవరి 6న ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ మొదలైంది. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీని ఐదు భాషల్లో ఏక కాలంలో రిలీజ్ చేయబోతున్నారు.