ఛార్మి కోర్ట్ పిటీషన్ ఒక పబ్లిసిటీ స్టంట్!!

Update: 2017-07-25 08:04 GMT
డ్ర‌గ్స్ విచార‌ణ కేసులో ప‌లువురు సినీ ప్ర‌ముఖుల‌కు అబార్కీ శాఖ నోటీసులు జారీ చేయ‌టం తెలిసిందే. నోటీసులు అందుకున్న ప్ర‌ముఖులు ఒక‌రి త‌ర్వాత ఒక‌రిగా విచార‌ణ‌కు హాజ‌ర‌వుతున్న వైనం కొద్ది రోజులుగా చూస్తున్న‌దే. అయితే.. ఇప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రూ చేయ‌ని రీతిలో.. సిట్ విచార‌ణ‌ను త‌ప్పు ప‌డుతూ.. త‌న‌కున్న సందేహాల్ని తెర మీద‌కు తీసుకొస్తూ.. హైకోర్టును సినీ న‌టి ఛార్మి ఆశ్ర‌యించ‌టం సంచ‌ల‌నంగా మారింది.

సిట్ విచార‌ణ‌కు హాజ‌రు కావ‌టానికి ఒక రోజు ముందు.. ఛార్మి ద‌ర‌ఖాస్తు చేసుకున్న పిటీష‌న్ హైకోర్టులో విచార‌ణ‌కు వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా ఛార్మి త‌ర‌ఫు న్యాయ‌వాదితో పాటు.. సిట్ త‌ర‌ఫు న్యాయ‌వాది త‌మ వాద‌న‌ల్ని వినిపించారు. త‌న పిటీష‌న్ లో ఏ వాద‌న‌లైన‌తే వినిపించారో దాదాపు అదే వాద‌న‌ను ఛార్మి త‌ర‌ఫు న్యాయ‌వాది వినిపించ‌గా.. అందుకు కౌంట‌ర్ గా సిట్ త‌ర‌ఫు న్యాయ‌వాది మాత్రం కాస్తంత ఘాటుగా త‌మ వాద‌న‌ల్ని వినిపించ‌టం క‌నిపించింది.

ఛార్మి వేసిన పిటీష‌న్ కేవ‌లం ప‌బ్లిసిటీ స్టంట్ మాత్ర‌మేన‌ని వ్యాఖ్యానించిన న్యావాది.. త‌ప్పు చేయ‌కుంటే భ‌యం ఎందుక‌ని ప్ర‌శ్నించ‌టం గ‌మ‌నార్హం.

నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా తాము విచారించ‌టం లేద‌ని.. ఆ ఆరోప‌ణ‌ల్లో నిజం లేద‌ని న్యాయ‌వాది స్ప‌ష్టం చేశారు. ఎన్టీపీఎస్ యాక్ట్ ప్ర‌కార‌మే కేసు విచార‌ణ సాగుతుంద‌న్న విష‌యాన్ని చెప్పిన సిట్ లాయ‌ర్‌.. తాము నోటీసులు ఇచ్చిన‌ప్పుడు విచార‌ణ‌కు ఆమె ఇంటికి కానీ.. ఆమె పేర్కొన్న ప్ర‌దేశానికి వ‌స్తామ‌ని చెప్పిన విష‌యాన్ని గుర్తు చేశారు. నోటీసులు అందించిన‌ప్పుడు సిట్ కార్యాల‌యానికే తాను వ‌స్తాన‌ని ఛార్మి చెప్పార‌న్నారు. ఇప్ప‌టికైనా స‌రే.. ఛార్మి చెప్పిన ప్ర‌దేశానికి వెళ్లి తాము విచార‌ణ చేస్తామ‌ని సిట్ త‌ర‌ఫు న్యాయ‌వాది స్ప‌ష్టం చేశారు.

ఆధారాల సేక‌ర‌ణ విష‌యంలో ఛార్మి అనుమ‌తి తీసుకున్న త‌ర్వాతే సేక‌రిస్తామ‌ని కోర్టుకు వెల్ల‌డించారు. ఇరు ప‌క్షాల వాద‌న‌ను విన్న న్యాయ‌మూర్తి మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు త‌న తీర్పును ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఛార్మి పిటీష‌న్ మీద వాద‌న జ‌రిగిన సంద‌ర్భంగా సిట్ త‌ర‌ఫు న్యాయ‌వాది త‌మ వాద‌న‌ల్ని సూటిగా.. స్ప‌ష్టంగా.. కాస్తంత సీరియ‌స్ గానే వినిపించిన‌ట్లుగా న్యాయ‌వాద వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి.
Tags:    

Similar News