న్యాయమూర్తులు కేసును వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా విచారణ చేపడుతున్నారు. ఇలాంటి సమయంలో పిల్లలు అయిన విద్యార్థులు ఎలా పరీక్ష సెంటర్ కు వెళ్లి పరీక్ష రాస్తారు అంటూ తమిళ స్టార్ హీరో సూర్య కామెంట్స్ చేశాడు. న్యాయ వ్యవస్థను ప్రశ్నించే విధంగా సూర్య వ్యాఖ్యలు ఉన్నాయని.. ఆయన పై కోర్టు దిక్కారం కేసును నమోదు చేయాలంటూ కొందరు డిమాండ్ చేశారు. ఈ సమయంలో న్యాయ వ్యవస్థను ప్రశ్నించడం అంటే ఏమాత్రం సమంజసం కాదంటూ నెటిజన్స్ కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సమయంలో మద్రాస్ హైకోర్టులో సూర్య విషయమై చర్చ జరిగింది.
నీట్ పరీక్షల నిర్వాహణ విషయంలో సూర్య చేసిన వ్యాఖ్యలను న్యాయమూర్తులు తీవ్రంగా తీసుకోవడం లేదని పేర్కొన్నారు. సూర్య వ్యాఖ్యలను అనవసరమైనవిగా సమర్థనీయం కానివని కోర్టు పేర్కొన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో న్యాయ వ్యవస్థను పరిరక్షించేందుకు మేము పని చేస్తున్నాం. మేము చేసే పనిని ఎవరు కూడా తక్కువ చేసి మాట్లాడటం సరి కాదు అంటూనే సూర్య వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోబోవడం లేదంటూ మద్రాస్ హైకోర్టు పేర్కొంది. దాంతో సూర్యపై కోర్టు దిక్కారం కేసు లేనట్లే అంటూ తేలిపోయింది. విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో ఆయన కాస్త వేదనతో ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంతే తప్ప న్యాయ వ్యవస్థను అవమానపర్చేలా ఆయన మాట్లాడినట్లుగా తాము భావించడం లేదని కోర్టు పేర్కొంది.