ఆమె ప‌ల్లె కోకిల‌.. ఈమె క్వీన్ ఆఫ్ మెలోడీ

Update: 2019-08-23 07:24 GMT
బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌ని ప్ర‌తిభావంతులు ఎంద‌రో. ప్ర‌తిభ‌ను వెలికి తీయాలే కానీ సువిశాల ప్ర‌పంచంలో చాలా ఉంది. ప‌ల్లె- ప‌ట్నం అన్న తేడా లేకుండా అన్నిచోట్లా ట్యాలెంట్ తెర మ‌రుగై ఉంది. కొంద‌రి జీవితం ఏ గుర్తింపు లేకుండా అలానే ముగుస్తుండ‌డం బాధాక‌ర‌మేన‌ని చెప్పాలి. అయితే అలాంటి ప్ర‌తిభ‌ను గుర్తించి బ‌య‌టి ప్ర‌పంచానికి ప‌రిచయం చేసేవాళ్లు ఎప్పుడూ దేవుళ్ల‌తో స‌మానం. ఈ విష‌యంలో టాలీవుడ్ సీనియ‌ర్ సంగీత ద‌ర్శ‌కులు కోటి కి అప‌రిమితంగా ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

అప్ప‌ట్లో ఓ మారుమూల ప‌ల్లెలోని ప్ర‌తిభ‌ను గుర్తించారాయ‌న‌. ప‌ల్లె కోకిల బేబీలోని ప్ర‌తిభ‌ను తొలిగా గుర్తించి త‌న‌ని వెతుక్కుంటూ వెళ్లి మ‌రీ సాయం అందించారు. స‌ద‌రు ప్ర‌తిభావ‌నికి అవ‌కాశాలిచ్చి సినిమాల‌కు పాడించారు. లైవ్ కాన్సెర్టుల‌కు ఆహ్వానించి ఎంతో ఆర్థిక సాయం ద‌క్కేలా చేశారు. ఇక ప‌ల్లె కోకిల అన్న‌ బిరుదుకు త‌గ్గ‌ట్టే ఎన్నో శ్రావ్య‌మైన‌ పాట‌లు పాడుతూ బేబీ అభిమానుల్ని సంపాదించుకున్నారు. త‌న పాట‌కు ఇప్పుడు ఫేస్ బుక్ లో అభిమానులు ఉన్నారు. మారు మూల ప‌ల్లె నుంచి వ‌చ్చిన బేబీ ఖ్యాతి కోటి గుర్తించ‌డం వ‌ల్ల‌నే విశ్వ‌విఖ్యాతం అయ్యింది. పేద‌రాలు అయిన బేబీకి మెగాస్టార్ చిరంజీవి స‌హా ఎంద‌రో ఆర్థికంగా తోడ్పాటును అందించారు.

ఇప్పుడు సేమ్ టు సేమ్ అదే త‌ర‌హాలో మ‌రో ప్ర‌తిభావ‌ని వెలుగులోకి వ‌చ్చింది. కోల్ క‌త రైల్వే స్టేష‌న్ వెలుప‌ల గాలి పాట పాడుకుంటున్న ఆవిడ ట్యాలెంటు అంద‌రికీ విస్మ‌యం క‌లిగిస్తోంది. క్వీన్ ఆఫ్ మెలోడీ ల‌తా మంగేష్క‌ర్ అంత గొప్ప‌గా ఆమె పాడుతుంటే ఆ పాట వింటున్న వాళ్లు త‌న్మ‌యం చెందుతున్నారు. ఇంత‌కీ త‌న‌ని ఎవ‌రు తొలిగా గుర్తించారు? అంటే ..బాలీవుడ్ ట్యాలెంటెడ్ సింగర్ కం మ్యూజిక్ డైరెక్ట‌ర్ హిమేష్ రేష‌మ్మియా .. ఆమె పాట‌లోని లాలిత్యాన్ని గుర్తించి సినిమాలో పాడేందుకు అవ‌కాశం ఇచ్చారు. త‌న‌తో పాడిస్తూ రికార్డింగ్ చేస్తున్న వీడియోని బాలీవుడ్ ఫోటోగ్రాఫ‌ర్ వైర‌ల్ భ‌యానీ స్వ‌యంగా అభిమానుల‌కు షేర్ చేశారు. ఆమె త‌న కెరీర్ తొలి సినిమా పాట‌ను ఆల‌పించార‌ని వైర‌ల్ భ‌యానీ వెల్ల‌డించారు. ల‌తా మంగేష్క‌ర్ .. జాన‌కి లా ఎంతో ప్ర‌తిభ దాగి ఉంది ఆమెలో. వెతికి ప‌ట్టుకుంటే ఇలాంటి ప్ర‌తిభ ఇంకా ఎంతో.. ఈ లోకంలో.

For Video Click Here

Tags:    

Similar News