కరోనా ఎఫెక్ట్‌ : కూరగాయలు అమ్ముతున్న డైరెక్టర్‌

Update: 2020-09-29 03:00 GMT
ఈ ఏడాది జనవరి ఫిబ్రవరి వరకు అంతా బాగానే ఉన్నా కొందరి జీవితంలో మార్చి నుండి అనూహ్య పరిణామాలు మొదలయ్యాయి. ఓడలు బండ్లు అయ్యాయి అన్నట్లుగా చాలా మంది ఆర్థిక పరిస్థితి ఏప్రిల్‌ నుండి దారుణంగా పడిపోయింది. కరోనా లాక్‌ డౌన్‌ తో వేలాది ఉద్యోగాలు పోయాయి. లక్షలాది మంది వలస కార్మికులు మరియు రోజు వారి లేబర్‌ తీవ్ర అవస్థలు పడ్డారు. సినీ ప్రముకులు కూడా కోట్లల్లో నష్టపోయిన విషయం తెల్సిందే. హిందీలో సూపర్‌ హిట్‌ అయ్య దేశ వ్యాప్తంగా మంచి ఆధరణ దక్కించుకున్న బాలికా వధు సీరియల్‌ కు ఎపిసోడ్‌ డైరెక్టర్‌ గా వ్యవహరించిన రామ్‌ విక్ష గౌర్ లాక్‌ డౌన్‌ కారణంగా తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నాడు అంటూ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎవరిని ఆర్థిక సాయం అడగలేక తన తండ్రి కూరగాయల వ్యాపారాన్ని రామ్‌ విక్ష గౌర్ కూడా చేస్తున్నారట. ప్రస్తుతం ఈయన యూపీలోని తన సొంత జిల్లా ఆజామ్‌ ఘడ్‌ లో కూరగాయలు అమ్ముతున్నాడట. హిందీతో పాటు భోజ్‌ పూరి సినిమాలు ఇప్పటికే కమిట్‌ అయిన ఈ దర్శకుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఆ సినిమాలను తీయలేక పోతున్నాడట. ఆ సినిమాల ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతున్న సమయంలో లాక్‌ డౌన్‌ విధించడంతో ఆ సినిమాలకు పెట్టుబడి పెడతామంటూ ముందుకు వచ్చిన వారు ఇప్పుడు తమ వల్ల కాదని ఏడాది ఆగాలన్నారట. దాంతో చేసేది ఏమీ లేక దర్శకుడు కూరగాయల వ్యాపారం మొదలు పెట్టారు అంటూ ప్రచారం జరగుతోంది. ముంబయిలో ఇల్లు ఉన్న తాను త్వరలో మళ్లీ ముంబయి వెళ్లి సినిమా పనులు మొదలు పెట్టుకుంటానంటూ ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పాడట.
Tags:    

Similar News