బబ్లీగా ఉంటే అదో సమస్య! పొట్టిగా ఉన్నా.. పొడుగ్గా ఉన్నా.. సమస్యనే! హెయిర్ ఉన్నా లేకున్నా.. తెల్లగా ఉన్నా నల్లగా ఉన్నా.. ప్రతిదీ ఒక ఇష్యూనే. ఈ జనం ఎప్పుడూ ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఎదుటివారిపైనే దృష్టి సారించి ఆ పనిలోనే ఉంటారు! అంటూ తనదైన శైలిలో కౌంటర్ వేసింది బబ్లీ బ్యూటీ భూమి పెడ్నేకర్. చిన్నప్పటి నుంచి ఇది చూస్తేనే ఉన్నానని కాస్తంత వెటకారంగానూ పంచ్ వేసింది ఈ అమ్మడు.
ఇటీవల `బాలా` చిత్రం విషయంలో నల్లగా ఉన్న తనకు గోధుమ రంగు అద్ది అందంగా చూపారు! అంటూ నెటిజనులు వెటకారం ఆడారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన భూమి ఇలా ఘాటైన ఆన్సర్ ఇచ్చింది. ``చిన్నప్పటి నుంచి నన్ను ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. `బాలా` వివాదంలో నన్ను అంతా ఆడి పోసుకున్నారు. అయితే ఈ తిట్లు ఇప్పుడే కాదు.. చిన్నప్పటి నుంచి ఎదుర్కొంటూనే ఉన్నాను. నేను చిన్నప్పటి నుంచి చబ్బీగా బబ్లీగానే ఉన్నాను. అయినా ఈ మాయదారి జనానికి ఏదో ఒక టాపిక్ కావాలి. ఆడా మగా అనే వైరుధ్యం సెక్సిజం అనేది సంఘంలో ఉంది. ఇండస్ట్రీలో కూడా ఇది ఉంది. ఒకవైపే సమాజం ఒదిగి ఉండడం అన్నది చూస్తున్నదే. ఇలాటి వాటికి నేను బాధితురాలిని`` అంటూ నిర్వేదం వ్యక్తం చేసింది.
పారితోషికాల అసమానతలపైనా భూమి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నేను ఎప్పుడూ నా తోటివారితో పోల్చుకోలేదు. ఎక్కువమందిని ఆకర్షించేంత స్టార్ డమ్ లేకుండా పెద్ద పారితోషికాల్ని డిమాండ్ చేయను. మనకు ఉండే ఆదరణను బట్టి మనకు ఉన్న ప్రతిభను బట్టి మాత్రమే పారితోషికం ఆశించాలి. నా మేల్ ఆర్టిస్టుకు ఇచ్చిన దాంట్లో 5 శాతం మాత్రమే నాకు ఇచ్చినా దానితో సరిపెట్టుకున్న సందర్భాలున్నాయి. హిట్లు ఫ్లాపుల పరంగా కెరీర్ గ్రాఫ్ ఒకేలా ఉన్నా మేల్- ఫీమేల్ మధ్య పారితోషికాల్లో చాలా తేడా ఉంటుంది అని చెప్పింది.
అయితే ఇటీవల ఈ పరిణామం మారింది. ఒక వేవ్ అనేది వచ్చింది. ఇప్పుడు నాయికా ప్రధాన పాత్రలు పుడుతున్నాయి. అందుకు తగ్గట్టే పారితోషికాలు బాగానే ఇస్తున్నారు. ఫీమేల్ పాత్రలు పవర్ ఫుల్ గా మారడంతో వచ్చిన మార్పు ఇది.. అంటూ చెప్పుకొచ్చింది. మన చుట్టూ ఉన్న జనాలు ఏదో ఒక సలహా ఇస్తూనే ఉంటారు. అలాంటి సినిమా చేయొద్దు.. ఇలాంటిది చేయొద్దు! అంటుంటారు. సలహాలు విని వదిలేయాలి! అని క్లాస్ తీస్కుంది.