చరణ్ 'డోప్'.. ఫ్యాన్స్ కు కావాల్సింది ఇదేగా!!

మరో 18 రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయనుంది. ఇప్పటికే మూవీపై ఆడియెన్స్ లో భారీ అంచనాలు ఉండగా.. మేకర్స్ వాటిని రోజురోజుకు పెంచుకుంటూ పోతున్నారు.

Update: 2024-12-22 11:29 GMT

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ అప్ కమింగ్ మూవీ గేమ్ ఛేంజర్.. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా.. మరో 18 రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయనుంది. ఇప్పటికే మూవీపై ఆడియెన్స్ లో భారీ అంచనాలు ఉండగా.. మేకర్స్ వాటిని రోజురోజుకు పెంచుకుంటూ పోతున్నారు.

అయితే మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ ఓ రేంజ్ లో సందడి చేస్తున్నారు. జరగండి జరగండి.., రా మచ్చా మచ్చా.., నా నా హైరానా.. సాంగ్స్ ఓ రేంజ్ లో అందరినీ అలరించాయి. చార్ట్ బస్టర్స్ గా నిలిచి.. మూవీపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. మేకర్స్ లో ఫుల్ జోష్ కూడా నింపాయి. ఇప్పుడు అదే జోష్ తో మేకర్స్.. ఫోర్త్ సింగిల్ డోప్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

అమెరికాలోని డల్లాస్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మేకర్స్ డోప్ సాంగ్ ను విడుదల చేయగా.. కాసేపటికే ట్రెండింగ్ లోకి వచ్చేసింది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ఓ రేంజ్ లో సందడి చేస్తోంది. భారీ వ్యూస్ అందుకుని రాణిస్తోంది. ఇనస్టెంట్ చార్ట్ బస్టర్ గా నిలిచి మ్యూజిక్ లవర్స్ ను మెప్పిస్తోంది. అందర్నీ ఫిదా చేసి తెగ ట్రెండ్ అవుతోంది.

అదే సమయంలో చరణ్ ఫ్యాన్స్.. డోప్ లిరికల్ సాంగ్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే.. పండుగ చేసుకుంటున్నారు. తెగ ఆకట్టుకుంటుందని, రిపీట్ మోడ్ లో చూస్తున్నామని చెబుతున్నారు. తమకు కావాల్సిన కంటెంట్ ఇదేనని.. చరణ్ స్టెప్పులు ఇరగదేశారని కొనియాడుతున్నారు. చెప్పాలంటే.. అది అక్షరాలా నిజం.

తమన్ అదిరిపోయే కంపోజిషన్ కు చరణ్ అంతకు మించి స్టెప్పులు వేశారు. ఆయన డ్యాన్స్ హైలైట్ గా నిలుస్తోంది. డోప్ పాటకు బాడీని మెలికలు తిప్పేశారు చరణ్. చాలా రోజుల తర్వాత ఆయన వింటేజ్ డ్యాన్స్ కనిపిస్తోంది. ఆర్ ఆర్ ఆర్ లో నాటు నాటు తప్ప చరణ్ కు స్టెప్పులు వేసే స్కోప్ దొరకలేదు. ఆచార్యలో చిన్న స్టెప్పులు మాత్రమే వేశారు. ఇప్పుడు డోప్ తో మాత్రం అలరించనున్నట్లు కనిపిస్తున్నారు.

అయితే సాంగ్ లో డైరెక్టర్ శంకర్ క్రియేటివిటీ.. జానీ మాస్టర్ మార్క్ క్లియర్ గా తెలుస్తోంది. వాటికి తమన్ బీట్.. చరణ్ డ్యాన్స్ తోడు అవ్వడంతో సాంగ్ అదిరిపోయిందనే చెప్పాలి. పాట రిలీజ్ కు ముందు.. చిన్న ప్రోమో, కామెంట్స్ క్రియేట్ చేసిన అంచనాలను అందుకొని ఆకట్టుకుంటోంది. మరి జనవరి 10వ తేదీన సిల్వర్ స్క్రీన్ పై డోప్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News