ఇక్కడ సరైనోడు.. అక్కడ హౌస్ ఫుల్-3

Update: 2016-06-08 13:30 GMT
కొన్నిసార్లు అంతే.. క్రిటిక్స్ అందరూ సినిమాను దుమ్మెత్తిపోస్తారు. కానీ ఆ సినిమా అదిరిపోయే కలెక్షన్లు సాధిస్తుంది. మన దగ్గర సమ్మర్ బ్లాక్ బస్టర్ ‘సరైనోడు’ విషయంలో ఇలాగే జరిగింది. ఆ సినిమాకు మొదట డివైడ్ టాక్ వచ్చింది. రివ్యూలు గొప్పగా ఏమీ రాలేదు. ఏవరేజ్ అన్నారు. నెగెటివ్ గానూ రాశారు. అయినప్పటికీ దాంతో ఏం సంబంధం లేకుండా కలెక్షన్ల వర్షం కురిపించిందీ సినిమా. ఇప్పుడు బాలీవుడ్ లో  ‘హౌస్ ఫుల్-3’ సినిమా పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈ సినిమాకు తొలి రోజు పూర్తి నెగెటివ్ టాకే వచ్చింది. క్రిటిక్స్ అయితే ఈ సినిమాను చీల్చి చెండాడారు. నాసిరకం సినిమా అని.. చీప్ కామెడీ అని కామెంట్లు చేశారు.

ఐతే ఆ ప్రభావం ఏమీ కలెక్షన్ల మీద పడలేదు. తొలి రోజే ఇండియా వరకే రూ.15 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. తొలి ఐదు రోజుల్లో ఏకంగా రూ.68 కోట్లకు పైగా కలెక్ట్ చేయడం విశేషం. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రూ.100 కోట్లను దాటిపోయి ఉంటాయని అంచనా వేస్తున్నారు. తొలి రోజుతో పోలిస్తే తర్వాతి రెండు రోజులు కలెక్షన్లు పెరగడం విశేషం. శనివారం రూ.16.5 కోట్లు తెచ్చిన ఈ చిత్రం.. ఆదివారం ఏకంగా రూ.22 కోట్ల దాకా కొల్లగొట్టింది. సోమవారం నుంచి కలెక్షన్లు తగ్గాయి కానీ.. మరీ డ్రాప్ ఏమీ లేదు. తర్వాతి రెండు రోజుల్లో 8 కలిపి రూ.16 కోట్ల దాకా వసూలైంది. ఇండియన్ కామెడీ సినిమాల చరిత్రలో ‘హౌస్ ఫుల్-3’నే బిగ్గెస్ట్ హిట్ అని అంచనా వేస్తున్నారు. ఇప్పటిదాకా సల్మాన్ ఖాన్ రీమేక్ మూవీ ‘రెడీ’నే నెంబర్ వన్ స్థానంలో ఉంది. దాని కలెక్షన్లను ‘హౌస్ ఫుల్-3’ ఆల్రెడీ దాటేసింది. ఈ ఏడాది ఇప్పటిదాకా బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ ఇదే అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
Tags:    

Similar News