IO Hawk.. ఇలా చెబితే అందరికీ అర్ధం కాకపోవచ్చు కానీ.. నాన్నకు ప్రేమతో టీజర్ లో.. ఐ వాన్నా ఫాలోఫాలో యూ సాంగ్ లో ఎన్టీఆర్ వాడిన హోవర్ బోర్డ్ అంటే మాత్రం అందరికీ తెలిసిపోతుంది. ఈ టీజర్ లో ఎన్టీఆర్ ఎంత అట్రాక్షనో.. ఆరేంజ్ లో ఈ హోవర్ బోర్డ్ కి కూడా క్రేజ్ ఏర్పడింది.
ఈ హోవర్ బోర్డును ఇపుడు మన సినిమాల్లో కూడా బాగానే వాడుతున్నారు. దిల్వాలే చిత్రంలో షారూక్ ఖాన్ ఉపయోగించడం చూడచ్చు. అక్షయ్ కుమార్ ఇప్పటికే రెండుసార్లు ఈ ఐవో హాక్ పై జర్నీ చేస్తూ కనిపించాడు. ఇక బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ షెట్టి అయితే.. షూటింగ్ స్పాట్స్ లో కూడా దీనిపైనే చక్కర్లు కొడుతున్నాడట. దీని పేరు టెక్నికల్ గా చెప్పాలంటే ఇంటెలిజెంట్ పర్సనల్ మొబిలిటీ డివైజ్ అంటారు. గతంలో అంటే అగ్రశ్రేణి దేశాల్లోనే ఇలాంటి డివైజ్ లు దొరికేవి. కానీ ఇప్పుడు ఈకామర్స్ పుణ్యమా అని.. ఏది కావాలంటే అది ఇండియాకు ఇంపోర్ట్ అయిపోతోంది. ఐతే.. ఐవో హాక్ అసలు తయారీదారుల నుంచి కొనాలంటే మాత్రం.. కొంచెం ఎక్కువ ఖర్చే అవుతుంది. వెయ్యి డాలర్ల నుంచి 18వందల డాలర్ల వరకూ కొన్ని వేరింయట్లో దొరుకుతాయి. ఎన్టీఆర్ ఉపయోగించినది ఈ ఒరిజినల్ ఐటెమే కానీ.. ఆన్ లైన్ లో దీనికి డూప్లికేట్స్ చాలానే ఉన్నాయిపుడు.
ఈబే, అమెజాన్ లాంటి మల్టీ నేషనల్ ఈ కామర్స్ సైట్లలో.. ఐవో హాక్ ఇప్పుడు దొరుకుతోంది. నిజానికి ఎన్టీఆర్ ఉపయోగించాక తెలుగు రాష్ట్రాల్లో వీటి క్రేజ్ అమాంతం పెరిగిందని చెప్పాలి. అయితే.. అందరూ ఎన్టీఆర్ మాదిరిగా హై కాస్ట్ పెట్టి ఒరిజినల్స్ కొనరు కదా. అలాంటి వారి కోసం 3-4 వందల డాలర్ల మధ్య దొరుకుతోంది. షిప్పింగ్ ఛార్జీలు కలుపుకుంటే.. ఓ పాతిక వేల రూపాయలకు ఎన్టీఆర్ వాడిన హోవర్ బోర్డ్ లాంటిది మనింటికీ వచ్చేస్తుందన్న మాట. కాకపోతే.. ఇవి అంత క్వాలిటీ ఉండవు లెండి. జస్ట్ కొన్నాళ్లు వాడి ఎంజాయ్ చేయడానికి మాత్రమే.