హీరోయిన్ అయ్యాక ఎఫైర్ అంటూ గాసిప్ వార్తలు రాయడం మామూలే అని.. కానీ తన విషయంలో కొందరితో ముడిపెట్టి రాయడం చాలా బాధపెట్టిందని కలర్స్ స్వాతి అంది. ముఖ్యంగా అల్లరి నరేష్ తో ఎఫైర్ అంటూ ఒక వార్త చదివి తాను షాకయ్యానని.. బాధపడ్డానని స్వాతి చెప్పింది. అలాగే నిఖిల్ తో ఎఫైరంటూ రాసినపుడు కూడా తామిద్దరం ఇబ్బంది పడ్డామని స్వాతి చెప్పింది. నిఖిల్ తనకు మంచి ఫ్రెండ్ అని.. తాను.. నిఖిల్ ఒక గ్రూప్ తో పాటు కలుస్తుంటామని.. ఇలాంటి వార్తల వల్ల ఇబ్బందికర పరిస్థితి తలెత్తిందని స్వాతి చెప్పింది. అల్లరి నరేష్.. నిఖిల్ మాత్రమే కాక నాని.. దేవిశ్రీ ప్రసాద్.. సునీల్ లాంటి వాళ్లతో కూడా తనకు ముడిపెట్టి వార్తలు రాశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
ఇక సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ.. తనకు కూడా ఇలాంటి వేధింపులు తప్పలేదని.. కొందరు ఏదో ఆశించి అవకాశాలు ఇవ్వబోయారని.. కానీ వాటిని తాను నిర్ద్వంద్వంగా తిరస్కరించానని ఆమె చెప్పింది. సోషల్ మీడియాలో తనకు వేధింపులు తప్పలేదని... కొన్నిసార్లు దీని వల్ల మానసిక ఒత్తిడికి లోనయ్యానని ఆమె చెప్పింది. రామ్ గోపాల్ వర్మతో ‘కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్రాజు’ సినిమా ఒప్పుకున్నపుడు చాలామంది ఆయన గురించి చెడుగా చెప్పారనరి.. అలాంటోడు ఇలాంటోడు అంటూ భయపెట్టే ప్రయత్నం చేశారని.. కానీ ఆయన ఒక జెంటిల్మన్ అని స్వాతి అభిప్రాయపడింది. ఇండియాలో మోస్ట్ ఎడుకేటెడ్ డైరెక్టర్లలో వర్మ ఒకడని ఆయనతో పని చేశాకే తెలిసిందని ఆమె అంది.