రణబీర్ కపూర్-అలియాభట్ జంటగా నటించిన 'బ్రహ్మాస్ర్త' మొదటి భాగం ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. తొలి షోతో సినిమాకి నెగిటివ్ రివ్యూలు సహా టాక్ మొదలైంది. 400 కోట్లు ఖర్చు బూడిదల పోసిన పన్నీరంటూ విమర్శలు తెరపైకి వచ్చాయి. కానీ టాక్ తో సంబంధం లేకుండా సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించింది.
రెండు రోజుల్లోనే 100 కోట్లు..అటుపై 250 కోట్ల క్లబ్ లోనూ నిలిచింది. దీంతో బాలీవుడ్ కి ఊపిరి పోసిన చిత్రంగా పేరు దక్కించుకుంది. సినిమా బ్రేక్ ఈవెన్ కష్టమైనా నెగిటివ్ టాక్ వచ్చినా ఈ రేంజ్ లో వసూళ్లు రావడంతో ట్రేడ్ సైతం విస్తుపోయింది. వరుస ప్లాప్ లతో సతమతమవుతోన్న బాలీవుడ్ కి ఈ సినిమా ఊపిరిపోసింది.
తాజాగా ఈ సినిమాకొచ్చిన విమర్శలపై అలియాభట్ తనదైన శైలిలో స్పందించింది. 'సినిమాపై ప్రతికూల వ్యాఖ్యలను పట్టించుకోకూడదని బ్రహ్మాస్త్ర టీమ్ నిర్ణయించుకుంది. అందుకే వాటి గురించి మేము ఎప్పుడూ ఆలోచించలేదు.
ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం పరచడంలో తప్పులేదు. అలాంటి అభిప్రాయాలు చెప్పే హక్కు ప్రతీ ఒక్కరికి ఉంటుంది.
వాటిని మేము ఎప్పుడూ గౌరవిస్తాం. సినిమా నిజంగా చెత్తగా ఉంటే బాక్సాఫీస్ వద్ద 150 కోట్ల మార్క్‌ను దాటేది కాదు. ఆ నెంబర్ సినిమా ఎలా ఉంది అన్నది చెబుతుంది' అని తెలిపింది. మొత్తానికి అలియాభట్ విమర్శలపై ఎవరి మనసులు నొచ్చుకోకుండా స్వీట్ సెటైర్ వేసింది. మరి ఈ విమర్శలపై హబ్బీ రణబీర్ ఎలా స్పందిస్తారో చూడాలి.
ప్రస్తుతం అలియాభట్ గర్భిణి కావడంతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటుంది. 'బ్రహ్మస్ర్త' ప్రమోషన్ కోసం ఎంతగా శ్రమించిందో తెలిసిందే. ప్రచారంలో భాగంగా టీమ్ తో కలిసి అన్ని రాష్ర్టాలు చుట్టేసింది. హాలీవుడ్ ఎంట్రీ మూవీ హార్ట్ ఆఫ్ స్టోన్ షూటింగ్ సైత ఎంతో ఉత్సాహంగా పూర్తిచేసింది. ఆ సినిమా ప్రచారానికి అమ్మడు రెడీ అయిపోతున్న సంగతి తెలిసిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.