న‌టి అశ్లీల వీడియోలు హీరోకు చేరిన విధానం!

Update: 2017-07-20 09:58 GMT
కేర‌ళలో పెను క‌ల‌క‌లం రేపిన న‌టి కిడ్నాప్‌ - అత్యాచార య‌త్నం కేసు రోజుకో మ‌లుపు తిరుగుతోంది. ఆమెను కారులో తీసుకెళుతున్న స‌మ‌యంలోనే కారు డ్రైవ‌ర్ ఆమెపై వేధింపులు మొద‌లుపెట్టాడ‌ని, అత్యాచార య‌త్నం కూడా చేశాడ‌ని, ఈ సంద‌ర్భంగా ఆ ఘ‌ట‌న‌కు సంబంధించిన మొత్తం ఫుటేజీని వీడియో తీశాడ‌న్న ఆరోప‌ణ‌లు ఒక్క కేర‌ళ‌లోనే కాకుండా దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడుగా ప‌ల్స‌ర్ సునీ అని, అత‌డిని అరెస్ట్ చేస్తే స‌రిపోతుంద‌ని భావించిన పోలీసులు అదే దిశ‌గా అడుగులు వేశారు.

అయితే ఈ కేసు క్లోజ్ అయిపోయిన‌ట్టేన‌న్న త‌రుణంలో మ‌రో కొత్త అంశం తెర‌మీదకు రావ‌డంతో నాటి కంటే పెను సంచ‌ల‌నాలు న‌మోద‌య్యాయి. కేర‌ళ నాట స్టార్ హీరోగా ఉన్న దిలీప్ ఈ మొత్తం వ్య‌వ‌హారానికి సూత్ర‌ధారుడ‌ని తేల‌డంతో అటు పోలీసుల‌తో పాటు ఇటు కేర‌ళ చిత్ర ప‌రిశ్ర‌మ కూడా షాక్ తిన్న‌ది. అయినా ప‌ల్స‌ర్ సునీ చేతికి అందిన న‌టి వీడియో... దిలీప్‌ కు ఎలా చేరింద‌న్న విష‌యంపై ఇప్పుడు కొత్త వాద‌న వినిపిస్తోంది. ప‌ల్స‌ర్ సునీ స‌ద‌రు వీడియోను త‌న‌కు తెలిసిన న్యాయ‌వాది ప్ర‌తీక్ ఛ‌కోవ్‌ కు పంప‌గా అక్క‌డి నుంచి ఆ వీడియో ఓ వీఐపీకి  చేరింద‌ట‌. ఆ వీఐపీ స్వ‌యంగా స‌ద‌రు వీడియోను దిలీప్‌ కు చేర‌వేశాడన్న విష‌యం మ‌రోమారు కేర‌ళ‌లో క‌ల‌క‌లం రేపుతోంది.

ఆమె వీడియోను దిలీప్‌ కు పంపిన స‌ద‌రు వీఐపీ ఎవ‌ర‌న్న విష‌యం పోలీసుల‌కు తెలిసినా... స‌ద‌రు వీడియో విష‌యాన్ని స్వ‌యంగానే వెల్ల‌డించడంతో పాటు విచార‌ణ‌కు స‌హ‌క‌రించార‌న్న కార‌ణంగా స‌ద‌రు వీఐపీ ప‌ట్ల పోలీసుల‌కు ఇప్ప‌టికీ సానుకూలంగానే ఉన్న‌ట్లు స‌మాచారం. అయితే కేసు చిక్కు ముడి వీడాలంటే స‌ద‌రు వీఐపీని విచారించాల్సిందేన‌ని భావిస్తున్న పోలీసులు నేడో - రేపో ఆ వీఐపీని స్టేష‌న్‌ కు పిలిపించే అవ‌కాశాలున్న‌ట్లు స‌మాచారం. అంటే... నటి కేసులో మ‌రో కీల‌క అరెస్ట్‌ - విచార‌ణ‌కు రంగం సిద్ధ‌మైంద‌న్న మాట‌. ఈ ట్విస్ట్‌ తోనైనా నటి కేసు విచార‌ణ ముగుస్తుందా?  లేదంటే మ‌రిన్ని ట్విస్టులు ఈ కేసులో వెలుగు చూస్తాయా అన్న ఆసక్తి నెల‌కొంది.
Tags:    

Similar News