స్టార్ హీరోలు థియేటర్లకు వచ్చి జనాల మధ్యన సినిమాలు చూడాలంటే చాలా కష్టం. మీడియం రేంజి హీరోలు వస్తేనే.. ప్రేక్షకుల్ని కంట్రోల్ చేయడం కష్టం. అలాంటిది స్టార్ హీరోలు వస్తే అంతే సంగతులు. అందుకే ఇంట్లో ఉండే ప్రివ్యూ థియేటర్లలో స్పెషల్ షోలు వేయించుకోవడం.. లేదా ప్రసాద్ ల్యాబ్ లాంటి చోట్లకు కుటుంబంతో వెళ్లి సినిమా చూసి రావడం చేస్తుంటారు స్టార్ హీరోలు. ఐతే మెగాస్టార్ చిరంజీవి మాత్రం ‘బాహుబలి: ది కంక్లూజన్’ సినిమాను ప్రసాద్ ఐమాక్స్ లాంటి పెద్ద మల్టీప్లెక్స్ లో సామాన్య జనం మధ్యన సినిమా చూశారు. మరి ఆ సమయంలో ఆయన ప్రేక్షకులకు చిక్కకుండా ఎలా మేనేజ్ చేశారు.. అసలు మల్టీప్లెక్సుకి వెళ్లి సినిమా చూడాల్సిన అవసరం ఆయనకు ఏమొచ్చింది. సినిమా చూస్తూ ఆయన ఫీలింగ్ ఏంటి.. చిరు మాటల్లోనే తెలుసుకుందా పదండి.
‘‘మామూలుగా ఏదైనా సినిమా చూడాలనిపిస్తే ఇంటి దగ్గర క్యూబ్ లోనో.. మరెక్కడైనా ప్రివ్యూ థియేటర్‌లోనో చూసేవాణ్ణి. చాలా ఏళ్ల తర్వాత నేను.. రామ్ చరణ్ థియేటరుకు వెళ్లి మరీ చూసిన సినిమా ఇదే. జనం మధ్యలో కూర్చుని.. వాళ్ల స్పందన చూస్తూ సినిమాను ఆస్వాదలనిపించేలా చేసింది ‘బాహుబలి’. ప్రసాద్ ఐమాక్స్ బిగ్ స్ర్కీన్లో రాత్రి 10 గంటల తర్వాతి షోకు వెళ్లాం. సినిమా ప్రారంభానికి ఒకటి, రెండు నిమిషాల ముందు వరకు కార్లోనే వెయిట్ చేశాం. సరిగ్గా టైంకి వెళ్లి.. వెనుక వరుసలో మాకోసం ప్రత్యేకంగా కేటాయించిన సీట్లలో కూర్చున్నాం. ఇంటర్వెల్ రాబోతుందనగా.. సెక్యూరిటీ సిబ్బంది మమ్మల్ని తీసుకెళ్లి ఆఫీస్ లో కూర్చోబెట్టారు. ఇంటర్వెల్ అయిపోయాక హాల్లోకి వెళ్లి మిగతా సినిమా చూశాం.సినిమా అయ్యేసరికి రాత్రి ఒంటి గంట దాటింది. కానీ టైమే తెలియలేదు. ఈ సినిమాలో ప్రతి ఘట్టం నన్ను ఆకట్టుకుంది. డబ్బే కాదు.. జీవితాల్ని.. కెరీర్లను రిస్క్ చేసి మరీ రాజమౌళి బృందం ఈ సినిమా చేసింది. వాళ్లను ఏదో అతీంద్రయ శక్తి నడిపించిందేమో అనిపించింది. ఇది గొప్ప ప్రయత్నం. ప్రభాస్.. రానా.. అనుష్క.. సత్యరాజ్.. రమ్యకృష్ణ.. నాజర్.. ఇలా ప్రతి ఒక్కరూ అద్భుతంగా చేశారు. విజయేంద్రప్రసాద్ కథ.. కీరవాణి సంగీతం.. మిగతా సాంకేతిక నిపుణుల పనితనం కలిసింది. సినిమా చూశాక బొకే తీసుకెళ్లి.. రాజమౌళి బృందాన్ని అభినందిద్దాం అనుకున్నా. కానీ అతను అప్పటికే లండన్ వెళ్లాడని తెలిసింది’’ అని చిరు చెప్పాడు.