టాలీవుడ్ సీనియర్ నిర్మాతల్లో ఒకరైన డీవీవీ దానయ్య.. గత ముప్పై ఏళ్లుగా సినిమాలు నిర్మిస్తున్నారు. కొన్ని చిత్రాలకు సమర్పకులుగా కూడా వ్యవహరించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎంతో మంది స్టార్ హీరోలతో అగ్ర దర్శకులతో సినిమాలు చేశారు.
ఈ క్రమంలో దానయ్య ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ అందుకున్నారు.. కొన్ని ప్లాప్స్ కూడా వచ్చాయి. చివరగా 'వినయ విధేయ రామ' తో నష్టాలు చవిచూసిన అగ్ర నిర్మాత.. ఇప్పుడు ''ఆర్.ఆర్.ఆర్'' సినిమాతో ఘనవిజయాన్ని అందుకున్నారు.
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా నటించిన చిత్రం "RRR" (రౌద్రం రుధిరం రణం). ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పీరియాడికల్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది.
ప్రపంచ వ్యాప్తంగా ట్రిపుల్ సినిమా ఇప్పటికే 920 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని 1000 కోట్ల దిశగా దూసుకుపోతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నైజాంలో 100 కోట్లకు పైగా వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. నార్త్ లో కూడా 200 కోట్ల మార్క్ అందుకుంది.
రోజురోజుకు బాక్సాఫీస్ వద్ద మరింత స్ట్రాంగ్ గా మారుతోంది. ఇప్పటికే ప్రాఫిట్ జోన్ లోకి వచ్చినట్లు డిస్ట్రిబ్యూటర్స్ గ్రాండ్ గా సక్సెస్ పార్టీలు నిర్వహిస్తున్న తరుణంలో.. RRR నిర్మాతకు ఈ సినిమా ద్వారా ఎంత వచ్చిందనే దానిపై చర్చ జరుగుతోంది.
'ఆర్.ఆర్.ఆర్' చిత్రం రెమ్యూనరేషనన్స్ కలుపుకుని దాదాపు 450 కోట్ల బడ్జెట్ తో రూపొందించబడింది. ఈ సినిమాని రిలీజ్ కు ముందే రూ. 800+ కోట్ల బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాల్లో టాక్ ఉంది. అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయినా నిర్మాత డీవీవీ దానయ్యకు పెద్దగా లాభం చేకూరలేదని ఓ రూమర్ ఇప్పుడు చక్కర్లు కొడుతోంది.
ట్రిపుల్ ఆర్ ప్రొడ్యూసర్ కు కేవలం 25 - 30 కోట్ల మేర మాత్రమే చేకూరిందని అంటున్నారు. సినిమాకు డబ్బు అందించిన ఫైనాన్షియర్లందరూ అతని భాగస్వాములయ్యారని.. మేజర్ వాటా వాళ్ళకే దక్కిందని.. అంతేకాదు రాజమౌళి ఫ్యామిలీ ప్యాకేజ్ గా లాభాల్లోంచి సింహభాగం తీసేసుకున్నారని పుకార్లు పుట్టుకొచ్చాయి.
ఇంతకముందు రాజమౌళి తో 'బాహుబలి' సినిమా చేసిన నిర్మాతలు కూడా ఎక్కువ ఆర్జించి లేదని అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు RRR వల్ల దానయ్య బ్యానర్ కు పేరు తప్ప లాభాలు వచ్చింది లేదని అంటున్నారు.
అయితే ఏ నిర్మాత అయినా కేవలం ముప్పై కోట్ల కోసం 450 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా చేసే అవకాశం లేదు. కాబట్టి ఈ రూమర్స్ ఫేక్ గా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. కాకపోతే ఇన్ కమ్ ట్యాక్స్ నుంచి తప్పించుకోడానికి ఎంతో కొంత తక్కువ లాభాలు చూపిస్తారు కానీ.. మరీ ఇంత తక్కువ వచ్చాయంటే నమ్మేలా లేదని అభిప్రాయ పడుతున్నారు.
'ఆర్.ఆర్.ఆర్' సినిమా వల్ల డీవీవీ దానయ్య కు ఎంత లాభం వచ్చిందనేది పక్కన పెడితే.. ఇంతవరకు మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ పార్టీ నిర్వహించలేదు. హిందీ డిస్ట్రిబ్యూటర్స్ పెన్ స్టూడియోస్ మాత్రం ముంబైలో గ్రాండ్ గా పార్టీ ప్లాన్ చేశారని తెలుస్తోంది. త్వరలో మేకర్స్ కూడా పెద్ద పార్టీ చూసుకుంటారేమో చూడాలి.