ఇటీవల కాలంలో దక్షిణాది చిత్రాలు బాక్సాఫీస్ ని షేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. హిందీ బెల్ట్ లోనూ సౌత్ సినిమాలు పెద్ద విజయం సాధిస్తున్నాయి. బాలీవుడ్ మొత్తం ఇప్పుడు సౌత్ పరిశ్రమల వైపు చూస్తుంది. అంతగా సౌత్ క్రియేటివిటీ బాలీవుడ్ కి పాకింది. ఇదే క్రమంలో బాలీవుడ్ సినిమాలు వరుసగా పరాజయం చెందుతోన్న సంగతి తెలిసిందే.
రెండేళ్లగా భారీ బడ్జెట్ చిత్రాలన్నీ డిజాస్టర్లగా మిగిలిపోతున్నాయి. కొన్ని పరిమిత బడ్జెట్ సినిమాలు మినహా చెప్పుకోదగ్గ సక్సెస్ హిందీ పరిశ్రమకి ఒక్కటీ లేదు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ పై సొంత భాష స్టార్లే తమ వైఫల్యాల్ని ఒప్పుకున్నారు. కథాబలం లేకపోవడంతోనే తమ ఇండస్ర్టీ సక్సెస్ రేట్ పడిపోయిందని నర్మగర్భంగా ఒప్పుకున్నారు.
సల్మాన్ ఖాన్ అయితే ఏకంగా సెటైరికల్ గానే స్పందించారు. తాజాగా అమీర్ ఖాన్ కూడా హిందీ పరిశ్రమ పరిస్థితి బాగోలేదని ఉద్దేశించారు. కరణ్ టాక్ షోలో హిందీ సినిమాలు చూడటానికి ప్రేక్షకులు పెద్దగా రావడం లేదు అన్నారు. దీనికి అమీర్ స్పందిస్తూ...''ఇదంతా విశ్వసనీయతకు సంబంధించింది. ప్రేక్షకులు సినిమాకి కనెక్ట్ అయితే వాళ్లకి భాషతో సంబంధం లేదు.
ఏ భాష చిత్రాన్ని అయినా ఆదరిస్తారు. అలా జరగాలంటే దర్శక-నిర్మాతలు-హీరోలు ప్రతీ ఒక్కరికి నచ్చే కథలు చేయాలి. ఒక సెక్షన్ ఆడియన్స్ ని మాత్రమే టార్గెట్ చేసి సినిమా చేస్తే ఫలితాలు ఆశించిన విధంగా రావు. సినిమాలో ఎమోషన్ ఉండాలి. అదీ చాలా సాపేక్షకంగా కనిపించాలి. నా వరకూ అందర్నీ మెప్పించే సినిమాలు చేయడానికి చూస్తాను' అని అన్నారు.
అలాగే ఓ వ్యక్తిగత ప్రశ్నకి అమీర్ ఇంట్రెస్టింగ్ బధులిచ్చారు. అమీర్ ఖాన్ షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నా.. ఆ బిజీ మొత్తాన్ని పక్కనబెట్టి వారానికి ఒకసారైన తన మాజీ భార్యల్ని కలుస్తానన్నారు. ''మాకు ఒకరిపై మరొకరికి నిజమైన గౌరవం.. అభిమానం..శ్రద్ద..ప్రేమ ఉన్నాయి. వాటిని అలాగే కాపాడుకోవాలి. ఆ బంధాలకు ప్రత్యేకమైన స్థానం కల్పించాలి.
బంధాలు బలమైనవి అని ఏదో రూపంలో చాట గలగాలి. విడిపోయినంత మాత్రాన ఏదో జరిగిందని విచారించకూడదు. మనిషి జీవితంలో అన్ని రకాల ఎమోషన్స్ భాగమే..సమానమే'' అని అన్నారు. ప్రస్తుతం అమీర్ ఖాన్ కథానాయకుడిగా నటించిన 'లాల్ సింగ్ చడ్డా' ఆగస్టు11న రిలీజ్ అవుతుంది. రిలీజ్ కి ఇంకా వారం రోజులే వ్యవధి ఉండటంతో ప్రచారంలో అమీర్ బిజీ బిజీగా ఉన్నారు.