తీసిన సినిమాయే ఎన్నిసార్లు తీస్తావ్ అంటూ 'జయం' సినిమాను పదేపదే రిపీట్ చేస్తే దర్శకుడు తేజను మనం ఏకిపారేస్తున్నాం కాని.. అక్కడ బాలీవుడ్లో మాత్రం ఒక స్టార్ హీరో తన ఫ్యామిలీతో కలసి తీసిన సినిమానే మళ్ళీ మళ్ళీ తీస్తున్నాడు. అవే క్యారెక్టర్లతో రచ్చ లేపేస్తున్నారు. అదిగో ఇప్పుడు అదే సినిమాలకు మరో సీక్వెల్ ను ప్రకటించారు.
తొలుత 'కోయి మిల్ గయా' అంటూ ఆకట్టుకున్నాడు కండలవీరుడు హృతిక్ రోషన్. ఈ సినిమాను డైరక్ట్ చేసింది డాడ్ రాకేష్ రోషనే. తరువాత ఈ సినిమాకు తొలి సీక్వెల్ గా 'క్రిష్' సినిమాను తీశారు. అందులో ఇద్దరు హృతిక్ లను చూపించారు. కట్ చేస్తే.. మొన్ననే 'క్రిష్ 3' అంటూ ఇంకో సీక్వెల్ వచ్చింది. కాకపోతే అనుకున్నట్లు ఆడలేదు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా ''క్రిష్ 4'' అంటూ తీస్తున్నారు. మళ్ళీ హృతికే హీరో రాకేష్ రోషనే డైరక్టర్. సినిమాను 2018 క్రిస్మస్ కు రిలీజ్ చేయబోతున్నట్లు కూడా అప్పుడే ప్రకటించేశారు.
ఇదేదో జేమ్స్ బాండ్ సినిమా తరహాలో క్రిష్ క్యారెక్టర్ ను కంటిన్యూ చేయడం బాగానే ఉంది కాని.. కాకపోతే కంటెంట్ లేని పిచ్చి పిచ్చి కథలను కూర్చి.. పాత చింతకాయ పచ్చడిని సరిగ్గా పండని గ్రాఫిక్స్ తో చూపిస్తే అవి చూడ్డానికి జనాలు సిద్దంగా లేరయ్యా హృతిక్. చూద్దాం ఏం మార్పులు చేస్తారో మరి.