కూల్ డాడ్.. సూపర్ కిడ్స్

Update: 2017-06-18 09:32 GMT
హీరో అనే పేరుకి అర్ధం తెలియని వయసులో  ప్రతి పిల్లలకు మొదటసారి కనిపించే  హీరో వాళ్ళ నాన్ననే కదా. పిల్లలుకు ఇవ్వవలిసింది ఆస్తి కాదు మన ప్రతిరోజులో కొంత సమయం అన్న మాటను అక్షరాల పాటిస్తున్నాడు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్. నాన్న ప్రేమ చూపించడం లో ఎప్పుడు ముందుంటాడు దాని కోసం ఎంత బిజీ లో ఉన్న కొంత టైమ్ తీసుకుంటాడు. ఇప్పుడు అంటే హృతిక్ రోశన్ సింగల్ గా ఉంటున్నాడు తన భార్య సుసానే ఖాన్ తో విడాకులు తీసుకొన్నా కాని.. ఇద్దరూ కలసి పిల్లలను విహారాలకు తీసుకెళుతుంటారు.

హృతిక్ రోశన్ తన పిల్లలతో చాలాసార్లు విహారి యాత్రలుకు వెళ్ళాడు వెళ్ళిన ప్రతిసారి తన అభిమానులుకు ఇలాంటి గొప్ప అనుభవాలునుతో పంచుకుంటూoటాడు . ఒక ప్రైవేట్ బోటు లో సముద్రంలోకి వెళ్లినప్పుడు తన పిల్లలు హ్రెహాన్, హ్రీధాన్ ను  ఒక హీరో ఫోజు ఇవ్వండిరా అని అడిగాడట. మరి ఆ పిల్లలు ఏమి అన్నుకున్నారో కానీ ఇలా ట్రంపోలిన్ పై ఎక్కి వాళ్ళ అరచేతి పై నిలుచోని విన్యాసాలు చేశారు. వాళ్ళ అమ్మ  తన కెమెరాతో క్లిక్ చేస్తుంటే వాళ్ళ నాన్న గర్వంగా చూస్తుంటే వీళ్ళు ఇలా స్వేచ్చ గా ఆడుకుంటున్నారు. హృతిక్ సుసానే విడిపోయినా పిల్లల పుట్టిన రోజునాడు కొన్ని సోషల్ ఈవెంట్లు లలో అప్పుడుప్పుడు కలుసుకుంటూనే ఉంటారు.

ఈ ఏడాది వచ్చిన హృతిక్ సినిమా కాబిల్ ఓ మోస్తరు విజయం సాధించింది. ఇప్పుడు ‘సూపర్ 30’ అనే సినిమా షూటింగ్ కోసం బిజీగా ఉన్నాడు. దీని తరువాత వాళ్ళ నాన్న రాకేశ్ రోషన్ డైరక్షన్ లో క్రిష్ 4 కూడా రాబోతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News