పెద్ద సినిమాలు.. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ప్రభావం చూపగల సినిమాలు.. ఒకే సారి రిలీజ్ కావడం కచ్చితంగా ఆయా చిత్రాల వసూళ్లపై ప్రభావం చూపుతుంది. అందుకే వీలైనంత వరకూ పోటీ లేకుండా ఉండేందుకు మేకర్స్ తో పాటు హీరోలు కూడా జాగ్రత్త పడుతుంటారు. కానీ సెంటిమెంట్స్ ఏవైనా ఉన్నపుడు.. వాటిని అధిగమించి రిలీజ్ డేట్స్ ను ఫిక్స్ చేయడం కొంత క్లిష్టమైన విషయమే.
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కు రిపబ్లిక్ డే బాగా అచ్చొచ్చింది. 2012లో అగ్నిపథ్.. 2017లో కాబిల్ అదే వీకెండ్ లో విడుదల అయ్యి మంచి వసూళ్లను సాధించాయి. అందుకే ఇప్పుడు తన సినిమా సూపర్30 ను 2019 రిపబ్లిక్ డేకి షెడ్యూల్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. అదే ఇప్పుడు సమస్య అవుతోంది. ఆ రోజున రజినీకాంత్- శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న 2.ఓ మూవీ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. నిజానికి రోబో సీక్వెల్ ఈ లోపే రావాలి కానీ.. డేట్స్ అడ్జస్ట్ కాలేదని అంటున్నారు.
ఈ ఏడాది దీపావళికి అమీర్ ఖాన్ మూవీ థగ్స్ ఆఫ్ హిందుస్తాన్.. క్రిస్మస్ కి షారూక్ ఖాన్ ఫిలిం జీరో విడుదల కానుండడంతో.. రిపబ్లిక్ డేకి 2.ఓ ను విడుదల చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారట. ఆ లెక్కన రజినీతో హృతిక్ పోటీ పడక తప్పదన్న మాట. 2017లో కూడా షారూక్ మూవీ రయీస్ తో హృతిక్ రోషన్ కాబిల్ పోటీ పడాల్సి వచ్చిన సంగతి తెలుసు కదా.