దర్శకుడు శంకర్ సినిమాల్లో సన్నివేశాలను వర్ణించడానికి.. భారీ అనే పదం కూడా చిన్నగానే అనిపిస్తుంది. సెట్స్ నుంచి సీన్స్ వరకూ అంత భారీగా తెరకెక్కిస్తాడు శంకర్. ఈయన సినిమాల్లో సెట్టింగులను, భారీతనాన్ని చూసి.. అబ్బరపడాల్సిందే. ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్, శంకర్ ల కాంబినేషన్ లో వస్తున్న రోబో సీక్వెల్ 2.0 కోసం ఇలాంటి రెండు భారీ సెట్స్ ను, సన్నివేశాలను పిక్చరైజ్ చేశారు.
2.0లో ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం భారీగా మిలిటరీ ట్యాంకులు తెప్పించారట. సినిమాలో అత్యంత కీలకమైన ఈ సన్నివేశాన్ని.. భారీ సెట్ వేసి రాత్రి పూట చిత్రీకరించారని తెలుస్తోంది. చెన్నై సిటీలోనే ఈ సీన్స్ ని తీయడం విశేషం. ఇక ఓ భారీ మొబైల్ ఫోన్ స్టోర్ సెట్ ని కూడా వేశారట. చెన్నై పొలిమేరల్లో చాలా స్పేసియష్ గా ఈ సెట్ ఉంటుంది. ఈవీపీ థీమ్ పార్క్ లో ఈ సెట్టింగ్ ని చాలా అందంగా రూపొందించారు.
ఈ మొబైల్ ఫోన్ స్టోరి వేలాది మంది కుర్రకారు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. సడెన్ గా సిటీలో మొబైల్స్ కరువు వస్తే ఏం జరుగుతుంది అనే కాన్సెప్ట్ ఈ సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. ఇప్పుడున్న టైంలో మొబైల్ ఫోన్లకు కరువు అంటే.. నానా రచ్చ అయిపోదూ. ఇలాంటిదే ఓ కొత్త ఆలోచనేదో చేసినట్లున్నాడు శంకర్. ఇలాంటి విచిత్రాలు రోబో 2.0లో చాలానే ఉంటాయి తెలుస్తోంది