`రంగస్థలం` చిత్రంలో చిట్టిబాబుగా నటించాడు రామ్ చరణ్. రాజమండ్రి- గోదావరి పరిసరాల్లో సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చెవులు వినిపించని రఫ్ అండ్ ఠఫ్ సిట్టిబాబు గా చరణ్ ఎంతో అద్భుతంగా నటించారు. ఇక గోదారి యాసను పలుకుతూ వేషం పరంగానూ అతడు తనదైన శైలి నటప్రదర్శనతో జనసామాన్యాన్ని విమర్శకుల్ని మెప్పించారు. ఈ సినిమా ఫలితం చరణ్ కెరీర్ లో మరువలేనిది.
అయితే ఈ మూవీ షూటింగ్ ని మెజారిటీ పార్ట్ గోదావరి పరిసరాల్లో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. స్పాట్ లో నిరంతరం మత్స్యకార కుటుంబాలు చరణ్ ని కలుస్తూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవారు. చాలా గ్యాప్ తర్వాత తిరిగి రామ్ చరణ్ రాజమండ్రికి షూటింగ్ నిమిత్తం వెళుతున్నారు. దీంతో అక్కడ అభిమానుల కేరింతలు సందడి కనిపించనుంది.
ఆదివారం ఉదయం 9 గంటలకే రాజమండ్రి విమనాశ్రయానికి చరణ్ చేరుకోనున్నారు. అనంతరం షూటింగ్ లో పాల్గొంటారు. అయితే విమానాశ్రయం పరిసరాల్లో పెద్ద ఎత్తున అభిమాను గుమిగూడతారని అంచనా వేసిన మెగాభిమాన సంఘాలు ముందస్తు హెచ్చరికలు చేశాయి. విమానాశ్రయంలోకి అభిమానులకు నేరుగా ప్రవేశం లేదు. బయట వెయిట్ చేయాల్సిందిగా అభ్యర్థించారు. చరణ్ నటించిన ఆర్.ఆర్.ఆర్.. ఆచార్య విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తదుపరి అతడు శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితోనూ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
#RC15 సంచలనాలు ఖాయం
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఆర్.సి 15 చితీకరణ సాగుతున్న సంగతి తెలిసిందే. కియరా కథానాయిక. కరోనా క్రైసిస్ కొనసాగుతున్నా కానీ శంకర్ తన టీమ్ తో పనిని ఆపేందుకు ఇష్టపడలేదు. చిన్న బ్రేక్ తర్వాత తిరిగి కొత్త షెడ్యూల్ ని ప్రారంభించనున్నారని ఇంతకుముందు కథనాలొచ్చాయి. ఫిబ్రవరి రెండో వారంలో ఓ పాట చిత్రీకరణను పూర్తి చేస్తారు.
ఈ చిత్రం లో చరణ్ యువ నాయకుడిగా నటిస్తారని ముఖ్యమంత్రి గా మారే ఐఏఎస్ అధికారిగా మెరుపులు మెరిపిస్తారని కియరా పాత్రకు అంతే ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. శంకర్ తో తొలిసారిగా అద్భుత అవకాశం దక్కిందన్న ఉత్సాహంతో చరణ్ డబుల్ హార్డ్ వర్క్ చేసేందుకు సంసిద్ధంగా ఉన్నారు. కోవిడ్ క్రైసిస్ ఓవైపు శంకర్ కోర్టు సమస్యలు మరోవైపు ఇబ్బందికరంగా మారాయి. శంకర్ లాంటి ఇండియా మోస్ట్ అవైటెడ్ దర్శకుడితో పని చేస్తున్నందుకు సునీల్.. కియరా లాంటి తారలు ఎంతో ఎగ్జయిటింగ్ గా ఉన్నారు. నవీన్ చంద్ర- అంజలి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు- శిరీష్ లు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను 2023 సంక్రాంతికి విడుదల చేయనున్నారు.
జెర్సీ దర్శకుడి కథేంటి?
గౌతమ్ తిన్ననూరి జెర్సీ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకుని ఇప్పుడు అదే చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్ కథానాయకుడిగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అంతకుముందే చరణ్ తో అతడు సినిమా చేయాల్సింది. కానీ అది వెంటనే కుదరలేదు. చెర్రీ కోసం అతడు ఎలాంటి స్క్రిప్టు ఎంపిక చేసాడు? అన్నది వేచి చూడాలి