కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు... బాహుబలి సెకండ్ పార్ట్ రిలీజ్ కు ముందు హీరో ప్రభాస్ ఎక్కడ కనిపించినా అతడికి ఎదురైన ప్రశ్న ఇది. బాహుబలి రిలీజైంది. ఈ ప్రశ్నకు సమాధానం దొరికిపోయింది. ఇప్పుడు ప్రభాస్ ఎక్కడికి వెళ్లినా ఇంకో కొత్త ప్రశ్న ఎదురవుతోంది. పెళ్లెప్పుడు చేసుకుంటున్నారు.. ఎవరిని చేసుకోబోతున్నారు.. అని. ఇప్పుడు ప్రభాస్ ఇండియాలోనే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్స్ లో ఒకడు. నిన్నమొన్నటి దాకా అతడి పెళ్లిపై టాలీవుడ్ లోనే ఆసక్తి ఉండేది. బాహుబలి తర్వాత ఇది దేశవ్యాప్తంగా ఇంట్రస్టింగ్ అంశంగా మారింది.
ఆమధ్య బాహుబలితో పర్ ఫెక్ట్ జోడీగా పేరు తెచ్చుకున్న అనుష్కనే ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నట్టు టాక్ వచ్చినా దానిని కొట్టిపారేశాడు. అసలు అలాంటి ఆలోచనే లేదని తేల్చేశాడు. ప్రభాస్ తో పెళ్లికి సిద్ధమంటూ ఇంతవరకు దాదాపు ఆరువేల వరకు ప్రపోజల్స్ వచ్చాయని అంచనా. ఇందులో దేశంలోని అన్ని ప్రాంతాలతోపాటు విదేశాల నుంచి కూడా ప్రపోజల్స్ వచ్చాయట. తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలంటూ పేరొందిన మాట్రిమోనియల్ వెబ్ సైట్స్ అతడి వెంటపడుతున్నాయి. అందులో ఒకటి రెండు భారీ మొత్తమే ఆఫర్ చేశాయట. కానీ వీటి వేటికి ప్రభాస్ ఎస్ అని చెప్పలేదు. సల్మాన్ ఖాన్ తరవాత బాలీవుడ్ ఓ హీరో పెళ్లి టాపిక్ పై ఈ రేంజిలో ఫోకస్ చేసింది ప్రభాస్ విషయంలోనే కావడం విశేషం. దీనిపై ఎంత డిస్కషన్ నడుస్తున్నా ప్రభాస్ మాత్రం ఎఫ్పటిలాగే సైలెంట్ గానే ఉండిపోతున్నాడు.
బాహుబలి తరవాత ప్రభాస్ సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ భారీ యాక్షన్ ఎంటర్ టెయినర్ గా తెరకెక్కుతోంది. తెలుగుతోపాటు తమిళం.. మళయాళం.. హిందీ భాషల్లో ఈ మూవీ ఒకేసారి విడుదల కానుంది. బాలీవుడ్ భామ శ్రద్ధ కపూర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.