అర్జున్ రాంపాల్- మెహర్ జెసియాలు విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. సామరస్యంగానే విడిపోవాలని డిసైడ్ అయ్యారని తెలిసిపోయింది. అయితే.. ఇలా స్టార్లు విడాకులు తీసుకోవడం సామర్యంగానే జరిగినా.. దాని వెనుక చాలా పెద్ద మొత్తం భరణం రూపంలో ఇవ్వాల్సి ఉంటుందనే సంగతి ఓపెన్ సీక్రెట్. ఈ సందర్భంగా ఒకసారి కొందరి విడాకుల విషయాలను మనం పరిశీలిస్తే.. షాకిచ్చే విషయాలు చాలా కనిపిస్తాయి. ఆ ఫిగర్లు చూస్తే మనకు మతిపోతుంది.
ఇప్పటివరకూ బాలీవుడ్ లో చాలామంది ఇలా విడాకులు తీసుకున్న వారు ఉన్నారు. వీటిలో ఖరీదైన విడాకుల వ్యవహారంగా చెప్పుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. ఆమిర్ ఖాన్- రీనా దత్తాలు విడాకులు తీసుకున్నపుడు.. చాలా పెద్ద మొత్తం చేతులు మారిందని అంటారు. సైఫ్ అలీ ఖాన్- అమృతకు 5 కోట్లు భరణం ఇవ్వడానికి ఒప్పుకుని రూ. 2.5 కోట్లు ముందు చెల్లించినట్లు స్వయంగా చెప్పాడు. సంజయ్ దత్ -రియా కపూర్ కు డైవోర్స్ ఇచ్చినపుడు 8 కోట్ల రూపాయతో పాటు ఓ లగ్జరీ కార్ ను కూడా ఇచ్చాడట. ప్రేయసి పాయల్ కు విడాకులతో పాటు ఆదిత్య చోప్రా 50 కోట్లను చెల్లించాడు.
ప్రభుదేవా తన తొలి భార్య రామలత్ తో విడిపోయినపుడు 25 కోట్ల రూపాయనలు.. 2 లగ్జరీ కార్లను ఇచ్చినట్లు చెబుతారు. కరిష్మాకపూర్- సంజయ్ కపూర్ విడాకుల వ్యవహారంలో 14 కోట్లు చేతులు మారగా.. నెలకు 10 లక్షల వడ్డీ వచ్చేలా బాండ్లను ఇవ్వాల్సి వచ్చింది. ఫరాన్ అక్తర్ - అధునా భవాని.. అనురాగ్ కశ్యప్- కల్కి విడాకుల టైంలో కూడా పెద్ద మొత్తమే భరణం రూపంలో ఇచ్చారు. అర్బాజ్ ఖాన్- మలైకా అరోరా ఖాన్ విడాకుల సమయంలో ఎంత మొత్తం భరణం అనే విషయం సీక్రెట్ గానే ఉండిపోయింది. ఇక అన్నిటికంటే ఖరీదైన విడాకులుగా హృతిక్ రోషన్ -సుసానే ఖాన్ డైవోర్స్ ను చెప్పుకోవాలి. సుసానేకు హృతిక్ 400 కోట్ల రూపాయలు ఇచ్చాడని టాక్.
ఏదేమైనా కూడా.. ఈ డబ్బంతా కేవలం ఆ భార్యలకు ఇస్తున్నట్లు కాదు.. వారి పిల్లలకు కూడా ఇస్తున్నట్లే. అందుకే కదా మన స్టార్లు డైవర్స్ టైములో అంత డబ్బులు పెడుతోంది. అయితే ఈ స్టార్లను పెళ్ళిచేసుకున్న తరువాత తమ కెరియర్లను వదులుకున్న భామలకు మాత్రం కాస్త బాధగానే ఉంటుంది. ఎంత డబ్బిచ్చినా కూడా వారి కెరియర్ మాత్రం తిరిగి రాదు.