గత కొన్నేళ్లలో టాలీవుడ్ సూపర్ స్టార్లలో బెస్ట్ బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ ఎవరిదంటే అల్లు అర్జున్ పేరే చెప్పాలి. డివైడ్ టాక్ తెచ్చుకున్న సినిమాలతో సైతం భారీ వసూళ్లే సంపాదించాడు బన్నీ. ‘సరైనోడు’ యావరేజ్ టాక్ తోనే బ్లాక్ బస్టర్ అయింది. ‘సన్నాఫ్ సత్యమూర్తి’.. ‘దువ్వాడ జగన్నాథం’ కూడా డివైడ్ టాక్ తోనే మొదలైనప్పటికీ అంచనాల్ని మించి వసూళ్లు రాబట్టాయి. అతడి కొత్త సినిమా ‘నా పేరు సూర్య’ మీద కూడా మంచి అంచనాలున్నాయి. ఇది కూడా టాక్ ఎలా ఉన్నా బాక్సాఫీస్ దగ్గర నెట్టుకొచ్చేస్తుందన్న అంచనాలతో ఉన్నారు ఫ్యాన్స్. ఐతే ప్రస్తుత పరిస్థితుల్లో బన్నీ ఏదో ఒక మోస్తరుగా నెట్టుకొస్తానంటే మాత్రం చెల్లదు. కచ్చితంగా అతను కెరీర్ బెస్ట్ హిట్ ఇవ్వాల్సిందే.
ఈ వేసవికి షెడ్యూల్ అయిన మూడు పెద్ద సినిమాల్లో రెండు ఆల్రెడీ రిలీజైపోయాయి. అందులో ‘రంగస్థలం’ నాన్-బాహుబలి రికార్డును నెలకొల్పే స్థాయిలో విజయవంతమైంది. లేటెస్టుగా విడుదలైన మహేష్ మూవీ ‘భరత్ అనే నేను’ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తొలి రోజు ఈ చిత్రానికి భారీ వసూళ్లే వచ్చాయి. టాక్ పాజిటివ్ గా ఉంది కాబట్టి ఈ చిత్రం రూ.100 కోట్ల షేర్ సాధించే అవకాశాలున్నాయి. ‘రంగస్థలం’ రికార్డుల్ని బద్దలు కొట్టినా ఆశ్చర్యం లేదేమో. మొత్తానికి ఇలా రెండు భారీ సినిమాలూ పెద్ద హిట్టయిపోయి బన్నీ మీద ప్రెజర్ పెంచేస్తున్నాయి. బన్నీ కూడా వీళ్లను దీటుగా బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ చూపించాల్సిన అవసరముంది. ఇంతకుముందు బన్నీ ముందు చరణ్ ఎంత అన్నట్లుండేది పరిస్థితి. కానీ చరణ్ ఒకేసారి చాలా మెట్లు ఎక్కేసి శిఖరం మీద కూర్చున్నాడు. ఇప్పుడు బన్నీ తనేంటో రుజువు చేసుకోకుంటే అతడి సత్తా మీద సందేహాలొస్తాయి. మరి ‘నా పేరు సూర్య’తో బన్నీ ఎలాంటి ఫలితాన్నందుకుంటాడో చూడాలి.