త‌మిళ `భాగ‌మ‌తి`కి భారీ డిమాండ్‌?

Update: 2017-11-28 12:52 GMT
ఒక‌ప్పుడు టాలీవుడ్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాల పేరు చెబితే హీరోయిన్ విజ‌య‌శాంతి గుర్తుకు వ‌చ్చేది. ప్ర‌స్తుతం ఆ స్థానాన్ని అనుష్క భ‌ర్తీ చేసింద‌ని చెప్ప‌వ‌చ్చు. ‘అరుంధతి’ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన అనుష్క ఆ త‌ర్వాత పంచాక్ష‌రి - రుద్రమదేవి ల‌తో మంచి సక్సెస్ ను అందుకుంది. తాజాగా - అనుష్క లీడ్ రోల్ లో రాబోతోన్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘భాగమతి’ సినిమాపై భారీ అంచ‌నాలున్న సంగ‌తి తెలిసిందే. అనుష్క‌పై న‌మ్మ‌కంతో దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్ తో యువి క్రియేషన్స్ ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. అయితే, ఆ బ‌డ్జెట్ ను వెన‌క్కు రాబ‌ట్టుకునేందుకు వారు గ‌ట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్ర త‌మిళ రైట్స్ ను రూ.10 కోట్ల భారీ రేటుకు అమ్మిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

యువి క్రియేషన్స్ అధినేత‌ల‌కు స్టూడియో గ్రీన్ అధినేత జ్ఞాన‌వేల్ రాజాకు స‌న్నిహిత సంబంధాలున్నాయి. దీంతో, రాజా ఈ చిత్రాన్ని తమిళంలో రిలీజ్ చేయబోతున్నాడట.  రూ.10 కోట్లకు భాగ‌మ‌తి తమిళ వెర్షన్ థియేట్రికల్ హక్కులతో పాటు శాటిలైట్ రైట్స్ కూడా తీసుకున్నట్లు సమాచారం. అయితే, రాజా నిర్మాణంలో సూర్య హీరోగా తెరకెక్కుతున్న `గ్యాంగ్` సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో యువి నిర్మాత‌లు  థియేటర్లు ఇప్పించడంలో హెల్ప్ చేస్తార‌ట‌. ఆ చిత్రం సంక్రాంతి బ‌రిలో రానుండ‌డంతో థియేట‌ర్లకు ఇబ్బంది లేకుండా యువి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నార‌ట‌. రూ.10 కోట్లు తమిళం నుంచే రావ‌డంతో, మిగ‌తా బడ్జెట్ రికవరీ కావ‌డం పెద్ద విష‌యం కాద‌ని ట్రేడ్ టాక్‌. ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జరుపుకుంటోంది. జనవరి 26న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ - మలయాళ భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Tags:    

Similar News