అప్పటివరకు 'బ్రూస్ లీ' సినిమా ఒక రకంగా సాగింది.. సడన్ గా క్లయ్ మ్యాక్స్ పూర్తవ్వగానే.. హీరోయిన్ చిక్కులో పడింది. అప్పుడు దిగాడు బాస్. బాప్ రే.. దీని కోసం కదండీ తెలుగు ప్రేక్షకులు గత కొన్ని సంవత్సరాలుగా ఎదురుచూస్తోంది.. దీని కోసం కదండీ.. మెగా ఫ్యాన్సు కంటి మీద కునుకు లేకుండా వెయిట్ చేసింది.. దీని కోసమే కదండీ.. అందరూ 150 150 అంటూ కలవరించింది.. అనుకున్నట్లే అయ్యిందిక.
మెగాస్టార్ చిరంజీవి.. ఒక హెలికాప్టర్ నుండి దిగడం.. గుర్రాల సాక్షిగా ఆయన ఎంట్రీ ఇవ్వడం.. మాసిన గెడ్డం.. ముఖానికి గాగుల్స్.. నల్లరంగు డ్రస్సు.. ట్రేడ్ మార్కు వాక్ స్టయిల్.. అలా అలా మెగాస్టార్ మెగా స్ర్కీన్ పై నడిచి వస్తుంటే.. ఇక ధియేటర్లన్నీ వేల వాట్ల రీసౌండుతో దద్దరిల్లిపోయాయ్. ఏళ్ళ తరబడి దాహంతో ఎదురుచూస్తున్న గొంతుల్లో కాచి వడపోచిన ఫిల్టర్ వాటర్ పోసినట్లుంది. పిల్లా పెద్దా.. ఆడా మగా.. ఫ్యాన్.. సినిమా లవర్.. ఇలా అందరికీ పూనకం వచ్చేసింది. ఊగిపోయారు. వీలలు వేశారు. చప్పట్లు. అరుపులు. కెవ్వు కేకలు. అసలు మెగా స్టార్ డైలాగులు కూడా విందాం అనే ఉద్దేశ్యం లేదెవ్వరికీ. మెగా దేవుడు వెండితెరపై కనిపంచాడు.. చాలు మాకు.. అంటూ రచ్చ చేసిపాడేశారు.
అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణల్లో ఎక్కడ చూసినా కూడా.. బ్రూస్ లీ సినిమాలోని కంటెంట్ కంటే.. ఆ సినిమాలోని చిరంజీవి క్యామియో గురించి ఇప్పుడు అన్ని చోట్లా మెగా డిస్కషన్లు నడుస్తున్నాయ్. అదరిపోయిందంతే.