ఊహించినట్టే సాహో టీజర్ వచ్చేసింది. అంచనాలకు తగ్గట్టే తెలుగు తెరపైనే కాదు ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటిదాకా చూడని యాక్షన్ ఫీస్ట్ ని ఆగస్ట్ 15 తీసుకొస్తానని హామీ ఇచ్చేసింది. ఇప్పుడు అందరి దృష్టి ప్రభాస్ ఏ రేంజ్ లో ఓపెనింగ్స్ తో రచ్చ చేస్తాడనే దాని మీదే ఉంది. మల్టీ లాంగ్వేజ్ లో హిందీ తెలుగు తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో ఒకేసారి విడుదలవుతున్న సాహో ఇప్పుడు బాలీవుడ్ ట్రేడ్ లో విపరీతమైన చర్చకు దారి తీస్తోంది.
సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ లాంటి స్టార్లు సైతం ఈర్ష్య పడి మేమా సినిమా చూడలేదు అని చెప్పుకునే స్థాయిలో చరిత్ర సృష్టించిన బాహుబలి హీరోగా ప్రభాస్ మీద నార్త్ లోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. అది చూసే అక్కడి బయ్యర్లు హిందీ వెర్షన్ మీద భారీ పెట్టుబడులకు రెడీ అవుతున్నారు.అందులోనూ టి సిరీస్ నిర్మాణ సంస్థ కాబట్టి స్క్రీన్ కౌంట్ పరంగా కనివిని ఎరుగని రికార్డులు నమోదు అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి
బాహుబలికి దీనికి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. రాజమౌళి తీసింది పూర్తిగా ఫాంటసీ సినిమా. విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు ఇప్పటితరానికి తెలియని ఓ యుద్ధవీరుల ప్రపంచంలోకి తీసుకెళ్లింది కాబట్టి బాషతో సంబంధం లేకుండా జనం బ్రహ్మరధం పట్టారు. ఇక్కడ దర్శకుడిగా జక్కన్న బ్రాండ్ బాగా పని చేసింది. కానీ సాహో పక్కా యాక్షన్ మూవీ. మసాలాలు ఎన్ని ఉన్నా ఇది ఫాంటసీ జానర్ కాదు. వాస్తవిక కోణంలోనే కథ సాగుతుంది.
సో సాహోని బాహుబలి స్థాయిలో రిసీవ్ చేసుకోవాలి అంటే అంతకు మించిన ఎమోషన్స్ మైండ్ బ్లోయింగ్ గ్రాఫిక్స్ ఇందులో ఉండాలి. పైగా సాహో డైరెక్టర్ సుజిత్ అంటే నార్త్ లో ఎవరికి పరిచయం లేదు. కేవలం ప్రభాస్ కటవుట్ పబ్లిసిటీ మెటీరియల్ చూసి పబ్లిక్ వస్తారు. సో ఎంతలేదన్నా దేశవ్యాప్తంగా సాహో 90 నుంచి 120 కోట్ల మధ్య ఓపెన్ చేస్తే ఖాన్లతో సహా అందరికి చెమటలు పట్టడం ఖాయం. నార్త్ లోనూ రీజనల్ సినిమా ఆధిపత్యానికి ఇది మొదటి మెట్టు అవుతుంది. మరి ప్రభాస్ సోలోగా ఈ సవాల్ ని ఎలా పూర్తి చేస్తాడో వేచి చూడాలి