అజిత్ డైరెక్టర్.. విజయ్ తో పాలిటిక్స్!

Update: 2023-01-18 23:30 GMT
తమిళ సినిమా పరిశ్రమలో డైరెక్టర్స్ హీరో కాంబినేషన్ కు ఉండే క్రేజ్ మిగతా ఇండస్ట్రీలలో కంటే ఎక్కువ స్థాయిలో ఉంటుంది. సాధారణంగా అక్కడ టాలెంటెడ్ దర్శకులు ఒకసారి ఫ్లాప్ అందుకున్న కూడా మరోసారి స్టార్ హీరోలతో సినిమాలో చేయడానికి అవకాశాలు అందుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఒక కాంబినేషన్ సెట్ అయింది అంటే కంటిన్యూగా ఒక మూడు సినిమాల వరకు కొనసాగుతూనే ఉంటారు.

ఇక అజిత్ విజయ్ దర్శకుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అజిత్ హెచ్ వినోద్ కాంబినేషన్ గత మూడు సినిమాల నుంచి హిట్ కాంబినేషన్ గా సాగుతోంది. కార్తీ తో ఖాకీ సినిమా తో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న ఈ దర్శకుడు ఆ తర్వాత బాలీవుడ్ పింక్ సినిమాలు అజిత్ తో తమిళంలో రీమేక్ చేసి మరో హిట్ కొట్టాడు.

ఇక తర్వాత వాలీమై కూడా కమర్షియల్ గా బాగానే సక్సెస్ అయింది. ఇక సంక్రాంతికి వచ్చిన తునివు కూడా 200 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకొని మంచి రికార్డులు అందుకుంది. అయితే ఈ దర్శకుడు విజయ్ తో కూడా సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ విజయ్ తో సినిమా చేస్తే కనుక తాను విభిన్నమైన పొలిటికల్ యాక్షన్ సినిమాలు చేస్తాను అని క్లారిటీ ఇచ్చాడు.

ఇంతకుముందు ఆయనతో చర్చించిన కథలలో కూడా పొలిటికల్ అంశాలు ఉన్నాయని త్వరలోనే తప్పకుండా విజయ్ తో మాత్రం పొలిటికల్ డ్రామాలో మంచి కథను తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను అని చెప్పాడు. ఇక ప్రస్తుతం అయితే ఈ దర్శకుడు కమల్ హాసన్ తో కూడా ఒక సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నాడు.

అలాగే కార్తితో కూడా మరో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అలాగే తమిళ్ కమెడియన్ యోగిబాబుతో సైతం ఒక పొలిటికల్ డిఫరెంట్ సినిమా అనుకుంటున్నాడు.  ముందు వరుసలో ఉన్న కాంబినేషన్స్ ముగిసిన అనంతరం ఈ దర్శకుడు విజయ్ తో తన మొదటి సినిమా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News