నా అవసరం త్రివిక్రమ్‌ గారికి లేదు

Update: 2019-02-20 08:21 GMT
జబర్దస్త్‌ కారణంగా ఎంతో మంది కమెడియన్స్‌ కు మంచి గుర్తింపు దక్కింది. అయితే ఆదికి మాత్రం అంతకు మించి, అందరిని మించి గుర్తింపు దక్కిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆది జబర్దస్త్‌ తో పాటు వెండి తెరపై కూడా తనదైన శైలిలో కామెడీతో అలరిస్తున్నాడు. ఆది నటించిన ఎక్కువ సినిమాలో తన పాత్రకు తానే డైలాగ్స్‌ రాసుకుంటాడని అంటూ ఉంటారు. ఇక కొన్ని రోజుల క్రితం త్రివిక్రమ్‌ ను ఆది కలిశాడు. దాంతో త్రివిక్రమ్‌ తన తదుపరి చిత్రంకు డైలాగ్స్‌ రాసేందుకు ఆదికి ఛాన్స్‌ ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి.

తాజాగా ఆ విషయమై ఆది స్పందిస్తూ అవి పుకార్లే అంటూ కొట్టి పారేశాడు. త్రివిక్రమ్‌ గారిపై తనకు చాలా అభిమానం ఉంది, ఆ అభిమానంతో ఆయన్ను మూడు సార్లు కలవడం జరిగింది. అభిమానంతోనే కలిశాను తప్ప అంతకు మించి మరేం లేదు. ఆయన సినిమాలకు మాటలు రాసేంతటి వ్యక్తిని నేను కాదు అంటూ ఆది చెప్పుకొచ్చాడు. త్రివిక్రమ్‌ గారు ఆయన తీసే సినిమాలకు కథ - మాటలు సొంతంగా రాసుకుంటారు. ఆయనకు మరెవ్వరి అవసరం లేదని ఆది అన్నారు. నాతో మాటలు రాయించుకోవాల్సిన అవసరం ఆయనకు లేదని ఆది అన్నాడు. సినిమాల్లో వరుసగా ఆఫర్లు వస్తున్నాయని, అయితే ప్రాముఖ్యత ఉన్న పాత్రలను మాత్రమే చేస్తానంటూ చెప్పుకొచ్చాడు.
Tags:    

Similar News