సూపర్ స్టార్ మహేష్ కెరీర్ 25వ సినిమా `మహర్షి` రిలీజ్ కి వస్తున్న సంగతి తెలిసిందే. మే 9న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సరిగ్గా నెలరోజుల ముందు మహేష్ కి అదిరిపోయే గిఫ్ట్ అందింది. ప్రపంచం అంతా తనవైపు చూసేలా.. మహేష్ మైనపు (వ్యాక్స్) విగ్రహాన్ని సింగపూర్ మ్యాడమ్ టుస్సాడ్స్ నిర్వాహకులు ఏఎంబీ సినిమాస్ లో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అదేరోజు సాయంత్రం ఆ విగ్రహాన్ని తిరిగి సింగపూర్ కి తరలించారు.
`నన్ను నేను చూసుకున్నట్టుంది!` అంటూ సూపర్ స్టార్ సంబర పడిపోయారు. ఆ విగ్రహాన్ని లాంచ్ చేసినప్పుడు క్యూట్ సితార ఎక్స్ ప్రెషన్స్ గురించి ఆసక్తికర చర్చ సాగింది. అయితే అది విగ్రహమా లేక డాడీయేనా? అన్నది తెలుసుకునేందుకు సితార ఏం చేసిందో తెలుసా? ఒకసారి ఆ విగ్రహాన్ని తాకి చెక్ చేసుకుందిట. ఈ విషయాన్ని మహేష్ స్వయంగా ఓ బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. నా కుటుంబ సభ్యులు ఎంతో ఎగ్జయిట్ అయిపోయారు. సితార అయితే అస్సలు అది నమ్మలేదు. అందుకే దగ్గరకు వెళ్లి టచ్ చేసి అప్పుడు ఓకే ఇది విగ్రహమేనని నిర్ణయించుకుందట. మా అబ్బాయి(గౌతమ్), నమ్రత కూడా ఎంతో అద్భుతంగా ఉందని సర్‌ప్రైజ్ అయ్యారని మహేష్ ఆ ఇంటర్వ్యూలో తెలిపారు.
ఇక సినిమాలకు స్క్రిప్టు ఎంపికల విషయమై ప్రస్థావిస్తూ.. ప్రతి సినిమాకి ఏదో ఒక వేరియేషన్ ని స్క్రిప్టులో కోరుకుంటానని మహేష్ తెలిపారు. ``నా స్క్రిప్టుల్ని నాకు నేనే ఎంపిక చేసుకుంటాను. అందులో ఎవరి సాయం తీసుకోను. స్క్రిప్టు విని నాకు నేనే జడ్జ్ చేస్తాను. అదంతా ఓ ప్రాసెస్. ప్రతిసారీ ఇదే పద్ధతిని అనుసరిస్తాను. ఆ ప్రాసెస్ లో వెళ్లడం గొప్ప జర్నీగా భావిస్తాను`` అని అన్నారు.