అంతా అబద్దం.. మీటూకు నేను వ్యతిరేకం

Update: 2019-02-19 09:52 GMT
మీటూ ఉద్యమంలో భాగంగా ఎంతో మంది హీరోయిన్స్‌ ప్రముఖులపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. అయితే ఆ ఆరోపణల్లో ఎక్కువ శాతం కక్ష సాధింపు ఆరోపణలు అని, ఎక్కువ మంది తప్పుడు ఆరోపణలు చేశారంటూ హీరోయిన్‌ రాయ్‌ లక్ష్మీ అభిప్రాయం వ్యక్తం చేసింది. మీటూ ఉద్యమం వల్ల ఏదో అద్బుతం జరుగుతుందని తాను భావించాను. కాని ఇండియలో మీటూ ఉద్యమం పూర్తిగా గతి తప్పింది. అంతా కూడా తప్పుడు ఆరోపణలతో మీటూ ఉద్యమంను తప్పుదారి పట్టించారు.

ఒకరిపై కక్ష సాధించాలంటే మీటూ అంటూ ఆరోపణలు చేశారు. ఎవరు నిజమైన ఆరోపణలు చేశారు, ఎవరు అబద్దపు ఆరోపణలు చేశారు అనే విషయం తెలియకుండా అయ్యింది. అందుకే నేను మీటూ ఉద్యమంకు మద్దతు తెలుపను. ఏది నిజం, ఏది అబద్దమో తెలియకుండా ఎలా మద్దతు తెలుపుతాను అంటూ రాయ్‌ లక్ష్మి చెప్పుకొచ్చింది.

నేను సినీ ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు అవుతుంది. ఎప్పుడు కూడా లైంగిక వేదింపులు ఎదుర్కోలేదు. హిందీ, తమిళం, తెలుగు ఎక్కడ అయినా కూడా నాకు ఆధరణ, గౌరవం దక్కిందని, ఎక్కడ నాతో ఎవరు కూడా చెడుగా ప్రవర్తించలేదని రాయ్‌ లక్ష్మి చెప్పుకొచ్చింది. చాలా ఎక్కువ మంది మీటూ అంటూ స్టోరీలు చెప్పారు. అన్ని అబద్దాలు అని నేను అనడం లేదు, కాని ఎక్కువ శాతం అబద్దాలు ఉన్న కారణంగా ఏది నిజమో, ఏది అబద్దమో తెలియకుండా ఉందని రాయ్‌ లక్ష్మీ పేర్కొంది. ఈ అమ్మడు హిందీ, తెలుగు, తమిళంలో వరుసగా ఏదో ఒక విధంగా అవకాశాలు దక్కించుకుంటున్నా సక్సెస్‌ లు మాత్రం ఆమెకు అందని ద్రాక్ష మాదిరిగానే ఉన్నాయి.
Tags:    

Similar News